పుట:ASHOKUDU.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

69

కాలమున విశేషవ్యాప్తమైయున్న హిందూమతముకూడ నా బౌద్ధధర్మవిభేదము నించుకంత కనుపెట్ట నారంభించెను. అశోక సార్వభౌముని రాజ్యకాలమునందుఁ బ్రప్రథమమున బౌద్ధమత మీవిధముగా నుండెను. అప్పు డుపగుప్తుడను నాతఁడు బౌద్ధసమాజమున మతాధి కారిగానుండెను. ఆతఁడు నిష్టాగరిష్ఠుఁడును, బుద్ధభ క్తుఁడు నై యుండెను. బౌద్ధశాస్త్రమునం దాతని కసాధారణ ప్రజ్ఞ యుండెను. ఆతఁడు పవిత్ర బౌద్ధమతముంగూర్చి యితరులు చేయుచున్న యపచారములం జూచి మర్మాహతుఁడయ్యెను. ప్రచ్చన్నులగు దుర్వినీతుల దుర్బోధనములను మాన్పించుట కొఱ కాతఁడు సాధ్యమైనన్ని ప్రయత్నములను జేయ నారంభించెను. కాని, స్వార్ధపరాయణు లగునట్టి కపట వేషధారులనుబట్టి శాసించుట యాతనికి శక్యము కాకపోయెను. వారు చేయుచున్న విరుద్ధ కార్యములం గను పెట్టి శాసింపఁ జూచినప్పుడు వారు తమ వాక్చాతుర్యముం జూపి తప్పించుకొనుచుండిరి. ఇవి యంతయును జూచుచు వినుచు నేమియుఁదోఁపక యుపగుప్తుఁడు నిరాశవలనను విరక్తివలనను దనమ తాధి కారమును వదలుకొని యేకాంత వాసము చేయుచుండెను,

ఈసంగతు లన్నియు నశోకమహారాజునకు యుధాసమయమునఁ గర్ణ గోచరము లయ్యెను. అప్పుడాతఁడు బౌద్ధ భిక్షులను దురాత్ములనుండి యుద్ధరించుటకు సంకల్పించుకొని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/77&oldid=334322" నుండి వెలికితీశారు