పుట:ASHOKUDU.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

65

షణమునకై యించుక యన్నమును జలమును లభించినచోఁ బరితుష్టినందవచ్చు నని యాతఁడు భావించెను. “అందుకొఱకు జీవహింస చేయుట యెందులకు?” అని ప్రశ్నించుకొనియెను. పిమ్మట మహారాజగునశోకుఁడు తన యాహారము కొఱకు మృగపక్ష్మి మారణము గావింపఁగూడదని యాజ్ఞాపించెను.

రాజానందము కొఱకును, మంత్రుల సంతోషము కొఱకును, నిత్యనూతనంబు లగు చిత్ర విచిత్ర ఖేలనములు జరగుచుండెడివి; అందుకొఱకొక విశాల ప్రాంగణమునఁ బశుపక్షి, మృగాదులద్వంద్వయుద్ధములు జరగుచుండెడివి. ఒక్కొక్కప్పుడు దుర్దాంతములగు సింహములతోడను, మద గజములతోడను, క్రూరశార్దూలములతోడను; ప్రబల వృషభముల తోడను, నపరాధులగు ప్రజలను బోట్లాడించి వారి బలపరిమాణములు గ్రహియింపఁబడు చుండెను. ఈ సకల వినోదవ్యాపారములును దుట్టతుద కేమైనవో మనము సులభముగ గ్రహియింపఁగలము, ఒకప్పు డట్టివిలాస క్రీడ లానంద దాయకములుగ నే యుండెను. ఇప్పుడా కాలము తిరిగిపోయినది. సూత్న తేజమునందు విస్పష్టముగఁ గానవచ్చుచున్న యార్తుల యశ్రు వర్షములును శిక్షితుల రక్తప్రవాహములును నాతని కసహ్యపరి వేదనముం గల్పించు చుండెను, ఆతని కరుణార్ద్రహృదయమునందు సర్వభూతసమానుభావ ముద

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/73&oldid=334289" నుండి వెలికితీశారు