పుట:ASHOKUDU.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

61

శ్యకము. కాని యంతమాత్రమున నేమగును ? మహారాజు యొద్దనిరంతరము నుండు సన్నిధానవర్తులకు మాత్రమే యాతని మనోభావములు బోధపడుచుండును. అట్టివారియొద్ద నాతఁడు తన మనో భావముల నెట్లుదాఁపఁగలుగును ? మనో భావములు ముఖమునందును మాటలయందును బ్రకాశితములగుచు నే యుండును" అనియెను.

ఆ నాఁడు మంత్రులీ విధముగ నాలో చించుకొని తమ తన వాహనముల నధిరోహించి మందిరములకుఁ బోయిరి. అనంతర మొకనాఁ డశోక సార్వభౌముఁడు తన విలాస సౌధమున వాయువిహారము చేయుచు జాల కాంతరముల నుండి వీథిని బోవుచున్న పరమసుందరుఁడగు నొక బాలకునిజూ చెను. ఆ బాలకుని శిరస్సు ముండిత మైయుండెను; ఆతఁడు కాషాయ వస్త్రములను ధరించియుండెను; ఆతనిహస్తమునఁగమండలు వుండెను. మృణాళ సదృశంబులును, కోమలంబులును, సువృత్తంబులు నగు నా బాలకుని బాహువులు కావివసనము చే నర్ధావృతము లై యండెను. అందుచే నా బాలకుని శరీరకాంతి మఱింత స్పష్టముగను దేజోవంతముగను గానవచ్చు చుండెను. అతని ముఖమండల మపూర్వ తేజ సంపన్నమై యుండెను. అతని విశాల నేత్రద్వయమునుండియ, హృదయ నిర్మలానందమును స్నిగ్ధకరుణామృతభావమును బహిర్గతము లగుచుండెను. అశోకుఁడు చాల సేపటివఱకు నా బాలకుని తదేక దృష్టితోఁ జూచుచుండెను. ఆ బాలుఁ డప్పుడు తనలో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/69&oldid=333992" నుండి వెలికితీశారు