పుట:ASHOKUDU.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

అ శో కుఁ డు

యెను. మఱియొకఁడు “ అట్లు కాదు. నేను వినియుంటిని. చండగిరికునికృత్యముల కాతఁడు మిగులఁ గ్రోధావిష్టుఁ డై యున్నాఁడు. ఆ చండగిరుకుఁడొకనాఁడు నిరపరాధియు, నలౌకికశక్తి శాలియునగు సముద్రగుప్తుఁడనునొక బౌద్ధసన్యాసిని జంపబోయెను; కాని యాతని యమానుషశక్తిం జూచి విస్మితుఁడును భయావహుఁడునై యావృత్తాంతమును మహా రాజున కెఱింగించెను. మహా రాజు స్వయముగ నరకగృహంబునకు వచ్చి యాసన్యాసి యత్యద్భుత మహిమలను గన్నాఱఁ గనుఁగొని యాతని సందర్శించెను; అతని యొద్ద బౌద్ధధర్మములం గూర్చి వినియుండెను. ఆ పిమ్మట నే నరక మందిరము నేలమట్టమై పోయినది. చండగిరికునకుఁ బ్రాణదండనము విధింపబడినది. అప్పటినుండియు మహారాజునకు మనసు తిరిగిపోయినది "అనియెను. అంతట మఱియొఁకడు ' ఇదియే సత్యమైయుండును' అని యాతని వాక్యములను సమర్థించెను. మరల నాతఁడు తక్కిన మంత్రివర్గముంజూచి “మహారాజు కళింగ దేశ యుద్ధ క్షేత్రమున నసంఖ్య జనక్షయముంగాంచి యతివిక లహృదయు డయ్యెననియు, నిఁక నెన్నఁడును రాజ్య లోభముచే యుద్ధము చేయఁగూడదని నిశ్చయించుకొనియె సనియుఁ బ్రధాన దండనాయకుని వలన నేను వినియుంటిని, 'రాజధర్మము సూక్ష్మ తమమై నది. రాజనీతి కృత్రిమ మైనది — సరళ భావముతో సకలవిష యములను బ్రదర్శించుట యీ రెంటికిని విరుద్ధము. కేవలం మెల్ల విషయములను బాహ్యదృష్టితోఁ జూచుటయే యావ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/68&oldid=333991" నుండి వెలికితీశారు