పుట:ASHOKUDU.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

అ శో కుఁ డు

డగు రఘుమహారాజు వంగ దేశము నతిక్రమించి మదమాతంగములతో సేతువు నిర్మించి కపిశానదిని ససైన్యముగా దాఁటియున్నాడు.

" బలయుతుఁడు రఘువు నౌకా
బలసంపన్నులగు వంగ | పతుల గెలిచి ని
ర్మల గంగా స్రోతంబుల
నలవున నాటిం చ ఘనజ | య స్తంభములన్ ."

" ఏనుగుల సేతువులఁ గపి
శానదిఁ దరియించి రఘుఁడు | చనియెఁ గళింగ
స్థానమునకు జయభట సం
తానముతో నుత్కళప్ర | దర్శిత పథుఁడై . "

రఘుమహా రాజు దిగ్విజయయాత్ర చేసిన మార్గము ననుసరించియే మగధాధిపుఁ డగు నశోకమహారాజు కూడ విపుల సైన్యముతోఁ గళింగమునకు గమనోద్యతుఁ డయ్యెను.

అప్పటికళింగ ప్రభుఁడు సామాన్యముగ నశోకునకు లోఁబడ లేదు. ఆ కారణము చే నిరువంకల సేనలకును మహారణము జరిగినది. కరితురంగ పదాదిగణంబుల పదాఘాతములచేఁ బ్రభవించినరజఃపటల మాకాశము గప్పివై చెను. రథ నేమినిస్వనఁబులును, గజబృంహితధ్వనులును, హయ హేషలును, వివిధాయుధఝణఝణారావంబులును గలసి సాగర

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/64&oldid=333887" నుండి వెలికితీశారు