పుట:ASHOKUDU.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాఱవ ప్రకరణము

55

నుండును. ఈసంగతులన్నియు నాలోచించుకొని వారు మహారాజు చెప్పినట్లు చేయవలయునని నిశ్చయించుకొనిరి. వా రెల్ల సంగతులును విస్పష్టముగ నశోక సార్వభౌమునకుఁ దెలియఁజేసిరి. అశోకుఁడు దిగ్విజయయాత్ర చేయుటకు నిశ్చయించెను. కొలఁది కాలములోనే యందులకుఁ గావలసిన ప్రయత్నములన్నియు సంపూర్ణములయ్యెను.

మగధ దేశాధిపతియగు నశోకమహారాజప్పుడు కళింగదేశ విజయమునకై విశేష సేనాపరివృతుఁడై యుద్ధయాత్ర చేసెను. వర్తమాన కాలమున నుత్కళము (ఉరియా) అను పేరుగల మదరాసు రాజధానియందలి కొంత భాగమప్పుడు కళింగదేశముగ వ్యవహరింపఁబడుచుండెను. కళింగ దేశము నీల సముద్ర సేవిత మై యుండెను. ఆ దేశ మధ్యమునుండి వై తరణీ తరంగిణీ ప్రవహించుచుండెను. నీలాచలము మొదలగు చిన్న పెద్ద పర్వతములవరుస లీ దేశమున వ్యాపించి విరాజమానము లగుచుండెను. అప్పటిసముద్రము, నదులు, పర్వతపంక్తులు నిప్ప టికి నా దేశమును సురక్షితముగఁ జేసియుంచుట చే నా దేశము నాక్రమించుకొనుట శత్రువులకు దుస్సాధ్యముగ నుండెను. మఱియొక విశేషము —— ఖర స్రోతానదీ యా దేశము కడవఱకును వ్యాపించియుండుట చే శత్రువులకు, దుష్ప్రాప్యమై యుండెను. రఘువంశ కావ్యమునందలి రఘు మహా రాజు దిగ్విజయభాగమును జదివినచో మన మీ విషయములన్నియు సప్రమాణముగ గ్రహింపఁగలుగుదుము. అయోధ్యానాయకు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/63&oldid=333872" నుండి వెలికితీశారు