పుట:ASHOKUDU.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ ప్రకరణము

49

ఈ సకలకారణములవనను నశోకున కొక్కప్పుడును నెమ్మదియనుమాట లేదయ్యెను. అప్పు డాతఁ డేవిధముచే నైనను శత్రుసంహారము చేయవలయు నని కృత సంకల్పుఁడయ్యెను. ఆతఁడ నేకు లగుగూఢచారులను నియమించి యుంచెను; వారందఱును జండి కాలయములు, దేవాగారములు, సైన్యావాసములు, పుణ్య క్షేత్రములు మొదలగు నానాప్రదేశముల నానా వేషధారులై సంచరించుచు నానా సమాచారములను సంగ్రహించుకొని వచ్చి యశోకు నకు నివేదించుచుండిరి. ఎవ్వ రెచ్చట నేవిధముగ రాజ ద్రోహ కార్యములం చేయవలయు నని యాలో చించుకొనుచుండిరో యంతయు నశోకున కతిని గూఢముగఁ దెలిసిపోవుచుండెను. క్రమముగ నెందఱో రాజద్రోహులు రాజ్యమునందు నిండి యున్నట్లు తెలియవ చ్చెను. రాజపరివారమునందుఁగూడ ననే కులనామము లావిద్రోహ నామసహితము లై వినఁ బడు చుండెను. ఆ కాలమునందు రాజద్రోహాపరాధులకు మరణ దండనముకంటె మఱియొక శిక్ష యేదియును లేదు. రాజద్రోహుల సంఖ్య వృద్ధియగుచున్న కొలందిని నర హత్యల సంఖ్యకూడఁ బ్రవర్ధిల్ల నారంభించెను. క్రమముగ నీనరహత్యల కొక విశాలావాసము కూడ నిర్మింపఁబడియెను. ఆ గృహమునకు నరకమని పేరు పెట్టఁబడియెను. పొరపాటు ననో, కాక గూఢచారులయసత్య సమాచారమూలము ననో గాని యొకనాఁ డొక బౌద్ధసన్యాసి యాహ త్యాగారమునఁ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/57&oldid=333690" నుండి వెలికితీశారు