పుట:ASHOKUDU.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదుమూఁడవ ప్రకరణము

45

రాధాగు ప్తఖల్లాతక ప్రముఖు లగు రాజసభాసభ్యులందఱు నేక గ్రీవముగ నిదివఱకే నిశ్చయించుకొని యుండుటచే వారందఱును గలసి యప్పుడే మగధ రాజ్యమున కశోకుని రాజుగఁ జేసి వైచిరి. బిందుసారునియనంతరమున నాతని ప్రియతమసతీరత్నమగు సుభద్రాంగి కుమారుఁ డశోకుఁడే యావిశాల మగధ రాజ్యమునకు మహిమాన్వితుఁ డగుమహా రాజచంద్రుఁ డయ్యెను— ఈయుత్సాహవార్త రాజ్యమునందంతటను బ్రక టింపఁబడియెను.

ఇట సుషీముఁడును నిశ్చింతుఁ డై యుండ లేదు. జనకుని కష్ట వార్త విన్న తోడనే యాతఁడును సాధ్యమైనంతవఱకు శీఘ్ర ప్రయాణములు చేసి స్వదేశమునకు వచ్చియుండెను. తోడనే మంత్రు లందఱును గలసి మగధరాజ్యమున కశోకునే రాజుగ నెన్నుకొని రనుసంగతి యాతని చెవులఁ బడియెను. బాహుబలముచే రాజధాని నాక్రమించుకొని పితృసింహాసనము నధిష్టించుటకంటె నాతని కిఁక గత్యంతర మేమియు లేదు. ఆ కారణమున నాతఁ డధిక సంఖ్యాక సైన్యముం గూర్చుకొని ససైన్యముగఁ బాటలీపుత్రసమిపమునకు వచ్చి విడిసెను. చిర కాలము క్రిందటఁ బాటలీపుత్రము ప్రాకార పరిఖా ద్వారములచే సురక్షితమై యుండెను. అశోకుని సేనానాయకు లింతకుముందే ప్రాకారమునకుఁ జుట్టునున్న యగాధమగునగడ్తను జలశూన్యముగఁ జేసి తుపాకిమందు కసవు మొదలగువానితోఁ గప్పివై చి యుండిరి. జసశూన్యంబును దృణశోభితంబును నగునా పరిఖం

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/53&oldid=333647" నుండి వెలికితీశారు