పుట:ASHOKUDU.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదుమూఁడవ ప్రకరణము


రాజ్యలాభము

మహా రాజగు బిందుసారుఁ డేబదివత్సరములు రాజ్యము చేసి క్రీ. పూ. 272 వ సంవత్సరమునందుఁ బరలోక గతుండయ్యెను. అప్పుడు మగధరాజ్య సింహాసనము శూన్యమై యుండెను. ఆతఁడు తన యనంతరమునందుఁ దన ప్రియ పుత్రుఁడగు సుషీముఁడే తనసింహాసనము నధిష్ఠింపఁగలఁ డనితలంచి యుండెను. ఇట్టియాశ చేత నే యాతఁడు తాను రోగశయ్య యందున్నప్పుడు తనకుమారుని దక్షశిలనుండి పిలిపింపవలయునని యాజ్ఞాపించి యున్నాడు. అప్పటియాతనియాజ్ఞ సరిగ నే పరిపాలింపఁబడినది; కాని యాతని యాశమాత్రము ఫలియించినది కాదు. ఎందులకు ఫలియింప లేదో యాసంగతి నిదివఱకే చెప్పియున్నారము, రాధాగుప్తు నిగూఢతంత్రము చే నశోకునకుఁ దన తండ్రి వ్యాధి గ్రస్తుడై యుండె ననుసంగతి ముందుగ నే తెలియవచ్చెను. ఆవార్త విన్న తోడ నే యశోకుఁడు తటి ద్వేగమున నుజ్జయినినుండి సాటలీపుత్రమునకు వచ్చియుండెను. కాని యాతని కప్పుడు జనక సందర్శన భాగ్యము లభియింప లేదు, శూన్యమైయున్న పితృసింహాసనమునుమాత్ర మాతఁడు దర్శించెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/52&oldid=349983" నుండి వెలికితీశారు