పుట:ASHOKUDU.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

43

చుండెను. సుషీముఁడు యువ రాజును జనకునకుఁ బ్రియపుత్రుఁడునుగూడ నై యుండెను. అయినను నశోకునిపక్షము ననే యున్నతోద్యోగుల యనురాగము ప్రబలతమమై యుండెను.

రాజధానియందలి యున్నతోద్యోగుల భావము లీవిధముగఁ బరిణమించు కాలమునందే యువరాజగు సుషీముఁడును నశోకుఁడునుగూడ నచ్చట లేకయుండిరి. అప్పుడు సుషీముఁడు తక్షశిలయందును నశోకుఁ డుజ్జయినియందు నుండిరి. ఈ సమయము నందే యాకస్మికముగ మహారాజగు బిందుసారుఁడు వ్యాధిపీడితుఁ డయ్యెను. ఆ వ్యాధి క్రమక్రమముగ వర్దిల్లు చుండెను. అప్పుడు మహారాజు యువ రాజగు సుషీముని బిల్పింపవలయు నని యాజ్ఞాపించెను. మహారాజు స్వస్థుఁడైయున్నను నస్వస్థుఁడై యున్నను నాతఁ డెప్పుడును గార్యాచరణవిషయంబునఁ బర ముఖా పేక్ష కలవాఁడే యై యుండెను. ప్రభుఁడగు బిందుసారుని యాజ్ఞ యధావిధిగఁ బరిపాలింపఁ బడినమాట సత్యమే— కాని, యాతని యభిప్రాయము మాత్రము సిద్ధించినది కాదు. రాధాగుప్తు ఁ డింతకుముందుగ నే బయలు దేరి రావలయు నని యశోకునకు వార్త నంపియుండెను. ఇప్పుడుకూడ నుద్యోగ పద్ధతి ననుసరించి సుషీమునకును మరల నశోకునకునుగూడ సమాచారము నంపించెను—— అప్పటికే మహారాజు వ్యాధి ముదిరిపోయినది. ఆరోగ్యము కలుగుననునాశ యతిస్వల్పము——


"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/51&oldid=333630" నుండి వెలికితీశారు