పుట:ASHOKUDU.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

అశో కుఁడు

రించియే రాజ్యమును బరిపాలించుచుండెను. ఆ రాజసభామధ్యమున రాధాగుప్తుడు మంత్రియై యుండెను. ఖల్లాతకుఁడు ప్రధానమంత్రి కాకపోయినను నాతని ప్రభావ మెల్ల విషయములయందును నిరాఘాటముగఁ గొనసాగుచుండెను, రాజోద్యోగులందజు నాతని మిగుల గౌరవించుచుండిరి. అశోకుఁడు తక్షశిలకు ఁ బోయిన కాలమున యువరాజగు సుషీముఁడు ప్రవీణుఁడగు నా ఖిల్లాతకుని జాల నగౌరవముగఁ జూచెను, రాజ్యమునకు భవిష్యత్ప్రభుఁడు కాఁదగిన యా యువరాజు నడవడి యందఱకు నసంతుష్టిని గల్పించెను, అందఱును క్షుణహృదయులై భయపడుచుండిరి. యువరాజగు సుషీముని ధూర్తత్వమును జూచి మంత్రియగు రాధాగుప్తుఁడు మిగుల విరక్తుఁ డయ్యెను. అప్పటినుండియుఁ గ్రమక్రమముగ నారాజస భాసభ్యు లందఱును యువ రాజు నెడల నసంతుష్టు లై పోయిరి. పిమ్మట నశోకుఁడు తక్షశిల యందు శాంతిని నెలకొల్పి మరలివచ్చెను. అప్పు డాతఁడు తన జనకుని యొద్దఁ గల యున్నతోద్యోగుల నందఱను సన్మానించెను. అప్పుడు రాధాగుప్తుఁడును ఖిల్లాతకుఁడును గూడ నెల్ల విధముల యువ రాజుకంటె నశోకుఁడే యోగ్యతముఁడని నిశ్చయించుకొనిరి. రాజసభలోని చాల మంది సభ్యుల సమాదరవిశ్వాసములు క్రమక్రమముగ నశోకుని వంక కే ప్రసరింపసాగెను; సుషీమునియందలి విర క్తియు నశోకునియందలి యనురాగమును దినదినాభివృద్ధి నందు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/50&oldid=333566" నుండి వెలికితీశారు