పుట:ASHOKUDU.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

37

యుండిరి. తరువాత నాతనిదయార్ద్రహృదయమున, దదను కూలవ్యవహారములను గాంచి తమకు క్షేమలాభములం గల్పిం చెద నని చెప్పిన సమాదర శీతలంబు లగు సాంత్వన వచనంబుల నాలకించి ప్రజాగణమంతయు శాంత భావమును వహించి యుండెను. అశోకునియాత్ర సఫలమైనది. పిత్రాజ్ఞాపరి పాలన మైనది.


పదునొకండవ ప్రకరణము


గుణాదరము

అశోకుఁడు తక్ష శిలయందు శాంతి స్థాపనము చేసి రాజధానికి మరలివచ్చెను. పదియాఱేడుల బాలకుఁ డగునా రాజు! కుమారుఁ డొక్కఁడును బోయి ప్రౌడులగువారికిఁగూడ నతి దుష్కరంబగు మహత్కార్యమును సర్వశ్రేయస్సంపన్నముగ నేఱ వేర్చుకొని వచ్చెను. మహారాజగు బిందుసారుఁ డింత, కాలము వఱకును గురూపి యనియు, వికారాకారుఁ డనియుఁ దలంచి యశోకుని జూచుటకుఁ గూడ నసహ్యపడుచుండెను, తక్ష శిలయందు శాంతిని నెలకొల్పుటకై పోయినయశోకున కచ్చట నేవిషమసంకటమున నైనఁబడి మరణించుటయే తటసించిన యెడల నది మహారాజునకు దుఃఖదాయక మే యగునో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/45&oldid=349950" నుండి వెలికితీశారు