పుట:ASHOKUDU.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము


రాజదర్శనము

ఆ బ్రాహ్మణుఁడు తనకుమారీమణిని నౌకయం దుంచి తానొక్కఁడును బాటలీపుత్ర నగరముం బ్రవేశించెను. ఆ పట్టణమునందలి సుప్రశస్త రాజపథంబులను, సుందర సౌధమాలికలను, మనోహరవ స్తుప్రపూర్ణంబు లగు విపణి శ్రేణులను, నానా దేశ జనసమూహములను జూచి యాదరిద్ర బ్రాహ్మణుఁడు విస్మయ విభ్రాంతులకు లోనై పోయెను. ఎట్లో యాతఁడు నాలుగైదు దినములలో నగరమధ్యమునందొక చోట నాశ్రయమును సంపాదించుకొనియెను. క్రమముగ నెంతయో ప్రయత్నించి రాజమంత్రియగు రాధాగు ప్తుని దర్శించి మహా రాజసందర్శనము చేయింపవలయ నని ప్రార్థించెను. రాధాగు ప్తుఁడు సదయ హృదయఁ డై యాబ్రాహ్మణునకు రాజసందర్శన భాగ్యమును లభియింపఁ జేసెదనని చెప్పెను.

నిర్దిష్టదినమున శుభముహూర్తమునం దాబ్రాహ్మణుఁడు రాజసభాంత రాళమునఁ బ్రవేశించెను. ఆ బ్రాహ్మణుఁడు క్రొత్త వాఁడు. రాజసభయందలి యందఱు నాతని కపరిచితులు. ఒక్క మంత్రినిమాత్ర మాతఁడు కొంత సేపటికి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/22&oldid=349780" నుండి వెలికితీశారు