పుట:ASHOKUDU.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

13

దచ్చ టచ్చట సరోవరములును, జలయంత్రములును, బుష్పవాటికలును శోభిల్లుచుండెను. రాజధాని దృఢప్రాకార సమన్వితమై, యగాధ పరిఘా వేష్టితమై యుండెను. అసంఖ్యాక సైన్యముచే నా నగరము సర్వదా రక్షింపబడుచుండెను, నగరమునం దంతటను బ్రజల సుఖ స్వాస్థ్యములకై యనేక విధములగు సదుపాయములు చేయఁబడెను. చంద్రగుప్తుని ప్రబల ప్రతాపమును, రాజప్రాసాదశోభాసంప త్తియు, నగర సౌందర్యమును, సంపత్సమృద్ధియు, సకల నియమానుకూల సమీకరణమును, సమాచీన శాసనమును గారణముగ నా పాటలీపుత్ర మా కాలమునం దే కాక తరువాతఁ జాల కాలము వఱకును భారతవర్షము నందును విదేశములందును గూడ విశేషవిఖ్యాతి నంది యుండెను.

చంద్రగుప్తసార్వభౌముని యనంతరము కీ|| పూ! 297 వ సంవత్సరమున నాతని కుమారుఁడగు బిందుసారుఁడు పై తృకంబగు పాటలీపుత్ర సింహాసనము నధిరోహించెను. క్రమముగ మహా రాజగు బిందుసారుని ప్రతాపకీర్తులు సర్వ దేశములయందును బ్రచారితము లయ్యెను.

చంపక నగర దరిద్ర బ్రాహ్మణుఁ డా బిందుసారునికీర్తి ప్రతాపముల నాలకించి విశేషముగ నాశపడి తన కుమారీ రత్నమును వెంటబెట్టుకొని యా పాటలీపుత్ర నగరమునకుఁ బ్రయాణమయ్యెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/21&oldid=333016" నుండి వెలికితీశారు