పుట:ASHOKUDU.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము 11


ఇప్పు డా నదీతీరమునకుఁ జిన్నవియుఁ బెద్దవియుఁగూడ వర్తకనౌకలు వచ్చుచుఁ బోవుచుండెను. అశ్విజమాసము వచ్చినది. బ్రాహ్మణుఁడు నిర్దిష్ట దినమున సుభద్రాంగిని వెంటబెట్టుకొని యావర్తకుని యోడపై నెక్కి రాజధానికిఁ బ్రయాణమయ్యెను.


నాలుగవ ప్రకరణము


పాటలీపుత్రము

మహారాజగు బింబిసారుని కాలమున మగధ రాజ్యమునకు రాజగృహము రాజధానిగనుండెను. రాజగృహమునకు నలుదెసలను పర్వతపంక్తులుండుటచే నా నగరము శత్రుదుర్భేద్యమై యుండెను. రాజులు తమ రాజ్యరక్షణ విషయంబున నెప్పుడును నిర్విచారముగ నుండఁజాలరు; ఎల్లప్పుడును దమ రాజ్యమును విస్తరింపఁ జేయవలయుననియే ప్రయత్నించు చుందురు. బింబిసారుని పుత్రపౌత్రులు తామా రాజగృహమునందే యున్నయెడలఁ దమరాజ్యమును విస్తరింపజేయుటకును, దా మున్నతిం బడయుటకును దగినంత యవకాశ ముండదని తలంపసాగిరి. క్రమముగా బింబిసారుని సంతతివారిదృష్టి పాటలీపుత్రము వైపునకుఁ బ్రసరింపసాగెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/19&oldid=333014" నుండి వెలికితీశారు