పుట:ASHOKUDU.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

రెండవ ప్రకరణము

ముగ నొసంగినచో నాతఁడీ మెను దనపుత్రవధువుగ ననుగ్రహించు ననుట యసంభవము కాదు. కాని యిట్టి దరిద్ర బ్రాహ్మణునియింటి కేమహారాజువచ్చును? — వారికటాక్షావలోకన మెట్లు లభియించును?

గృహి:-ఇఁక నేమియుపాయము ?

గృహ:- నే నీ చిన్ని బాలికను వెంటఁ బెట్టుకొని మహారాజగు బిందుసారుని రాజధానికి బాటలీపుత్రమునకుఁ బోయెదను. ప్రయత్నించెదను—భగవదనుగ్రహ మున్నచో మహా రాజు శుభదృష్టి లభియించును.

గృహి:- ఈ యాఁడుబిడ్డను వెంటఁ బెట్టుకొని దూర దేశమునకుఁ బోవుట యేమంత మంచిది ? ఇందునుగూర్చి లోక మేమనుకొనును?

గృహ:— అనుకొననిమ్ము ! ధర్మమును దైవమును సాక్షిగ నుంచుకొని నేనీ కార్యమునఁ బ్రవేశించెదను. నా చిన్ని సుభద్ర మేలుకొఱకుఁ బస చేయుచున్న నాకు లోకము వలని నిందాస్తుతులతో నిమిత్తము లేదు. నేను తప్పక పాటలీపుత్రమునకుఁ బోయెదను. ఈ ప్రయాణము శుభదాయక మగునని దైవజ్ఞుఁడు చెప్పియున్నాడు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/17&oldid=333005" నుండి వెలికితీశారు