పుట:ASHOKUDU.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసమయమునందు గృహస్థుఁడు గృహిణిం బిలిచి దైవజ్ఞుఁ డేమేమి చెప్పియుండెనో యన్ని సంగతులను సవిస్తరముగఁ దెలుప నారంభించెను. మొదటినుండియు నెల్ల సంగతులను వినవలయునని గృహిణి యాత్రముతోడ నేయుండెను. కాని పనులతొందర వలనను గుమార్తె తన యొద్ద నుండుట వలనను దన భర్తంగూర్చి యింతవఱకు నామె యా విషయమునఁ బ్రశ్నించియుండ లేదు. అప్పుడా దైవజ్ఞుని భవిష్య ద్వాణింగూర్చి యెంతవఱకుఁ దనభర్త తనకుఁ జెప్పి యుం డెనో యామాటలు మరలమరల వినవలయు ననియే యామె వేఁడుకపడఁజొచ్చెను.

గృహ:- ఇప్పుడు మన మేమి చేయవలయును?

గృహి:- నేనేమి చెప్పఁగలను?

గృహ:-ఎట్లో యొక విధముగ నాలోచించి యేదైన నుపాయమును జెప్పుము !

గృహి:- ఇంకను నుపాయమేమి? దేవుఁడు మన యెడల నెంతదయ కలిగియున్నాఁడు! మన సుభద్రాంగి నిజముగా మహారాజ్ఞి యగునా?

అని చెప్పుచుండఁగా నా మెకన్నులలో నానంద బాష్పములు మిలమిల మెఱయఁజొచ్చెను.

గృహ:-మనసుభద్ర పర మసుందరి-ఉమా సమానురాలు, అదృష్టవశమున నీమె నేమహా రాజునకై న నుపాయన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/16&oldid=333003" నుండి వెలికితీశారు