పుట:ASHOKUDU.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము


బ్రాహ్మణ దంపతులు

ఆ దరిద్ర బ్రాహ్మణుని యిల్లు మిక్కిలి చిన్నదిగ నుండెను. గృహద్వారములును జిన్నవిగనే యుండెను. అందువలనఁ బై వారెవ్వరైన నీయింటికి వచ్చినప్పు డింటి వారికి మిగులఁ నననుకూలముగనుండును. దైవజ్ఞుఁడు శుభ ఫలములను జెప్పి యున్నాఁడు. అది యాదంపతుల కానందదాయకముగ నేయున్నది. ఆ కారణమున నే వారాతని దమ యింటికి భోజనమునకుఁబిలిచి యున్నారు. కాని తాము దరిద్రులగుటచే నను పపత్తివలన నాతిథ్యవిషయమునం దాతని కేమేమి లోపములు జరిగియుండెనోయనియు నందువలనఁ దమ కేమగునోయనియు మిగుల సంకోచించిరి. కాని యా సంకో చము వారి హృదయమున నెంతయో సే వుండ లేదు. అతిథిసత్కారముల నంది దైవజ్జుఁడు వెడలిపోయెను.

సుభద్రాంగి యింతవఱకు సిగ్గుచే నొకచోటఁ కూర్చుండి యుండెను. ఆతఁడు వెడలిపోయినతరువాత నెప్పటివ లె నాయింట మసలుచుఁ దల్లి కింటిపనులలో నించుక తోడుపడుట కారంభించేను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/15&oldid=333002" నుండి వెలికితీశారు