పుట:ASHOKUDU.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వందనము

135

న్విత మహారాజ సార్వభౌముఁడగు నశోకుఁ డంతర్హితుఁడై పోయెను. మహా పురుషు లందఱికం టెను మహాపురుషుఁడు!

రెండు వేల సంవత్సరములు గడిచిపోయినవి. కాలప్రవాహమునం దెన్నియో కీర్తి చిత్రములు భగ్నములై పోయినవి—— తేలిపోయినవి. ఓ మహారాజా ! ఓ భారత గౌరవమూర్తీ !నీ కీర్తిచిత్రములు మాత్ర మెన్ని నాశనములై పోలేదు! కాని యశరీరిణియగు వాణికి మాత్రము నాశనము లేదు ! ఓ సార్వభౌమా ! ధర్మశోకా ! నీ విశాలకీర్తి కీర్తనములను నీ విశాల రాజ్యసుఖ శాసన కథా ప్రతిధ్వనులలో మే మిప్పటికిని వినుచునే యున్నారము ! పరమ పావన శోభా భాసమానంబగు నీ పాటలీపుత్రమిప్పు డెక్కడ నున్నది? నయనాభిరామంబగు నీ కుక్కుటా రామం బిప్పుడేమై పోయినది ? ఆ సాంచిస్తూప మగపడ దేమి !—— ఆ గుహా మందిర మేది ? 'కాలతరంగ కఠోరాఘాతములచే నందిప్పుడు కొన్ని లుప్తములై పోయినవి ! కొన్ని భగ్నములై పోయినవి! కొన్ని వికృతములై పోయినవి ! కాని యంతటి ఘన ప్రతి ష్టాపనములం గావించిన నీహృదయమునందలి శాశ్వత శుభోద్దేశమును నీ పూర్వకథా భారతీప్రసాదముచే మే మిప్పటికిని మాక్షుద్రకుటీరములయందుండి యాకర్ణించుచు నానంద పులకాంకిత విగ్రహులమై వెంటనే యవనతమ స్తకులమై నీ రాజ్యలక్ష్మికి సహస్రశత సహస్రాభి వాదనములం గావించు చున్నారము!! ఓ రాజచూడామణీ! నీ ప్రజల యైహికాముష్మిక సుఖ సమృద్ధులం గూర్చియ, నీ సర్వసుఖ శాసనములం గూర్చియు, నీ దుష్ట శిక్షణ శిష్ట పరిపాలనతత్పరతం గూర్చియు,