పుట:ASHOKUDU.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

129

' సార్వభౌముఁ - డావిషమమునఁగూడఁ దన రాజ్యమునం దనేక విధములగు శాసనములను ప్రకటించియుండెను. అట్టి శాసనములలోఁ గొన్నిటిని మాత్ర మీ క్రింద లిఖించుచున్నాము.

“ ఇంతటినుండి నారాజ్యము నందెచ్చటను నీ క్రిందిజీవులను హింసింపఁగూడదు-చిలుక, గొర వంక , చక్రవాకము, రాజహంస, గింజల నేరికొనితిను పక్షులు పికిలిపిట్ట, కూర్మము, శంకరమత్స్యము, వానరము, ఆబోతు, ఖడ్గమృగము, పావురము, గువ్వ, పిచ్చుక , ఆడు మేఁక , ఆఁడుపంది, గర్భిణి, దుగ్ధవతిగాడిద, గుఱ్ఱము, గోవు- మొదలగునవి” అశోకుని శాసన ములను బట్టిచూడఁగా నాషాఢ పూర్ణిమ మొదలు కార్తికపూర్ణిమ వఱకును, మఱియు నితర మాసములయందలి విశేష నిర్దిష్టదినములయందును, మత్స్యవధయు, మత్స్య విక్రయ మునుగూడ నిషిద్ధములై యుండెను. ఇట్లునిషేధించి శాసించుటచేఁగూడ నాతఁడు తృప్తుఁడై యుండ లేదు. జీవజంతువులు నివసించుటకును జీవించుటకునుగూడ ననేక ఫలవృక్షములు గల తోఁటలనుగూడ నిర్మించెను. దేశమునం దంతటను జికిత్సాలయములఁ గట్టించెను. రెండు వేల సంవత్సరములకుఁ దరువాత నిప్పుడు మనము జీవ క్లేశనివారిణీ సభలను స్థాపించి యప్పుడప్పుడు పశుపక్ష్మిమ త్స్యాదులను హింసించుట దోషమని నిషేధించుచు నచ్చటచ్చటఁ బశుచికి త్సాలయములను స్థాపించుట చేతమాత్రమే మనము నాగరకుల మనియు గౌరవాన్వితులమనియు భావించు కొనుచున్నాము! కాని యశోకుని