పుట:ASHOKUDU.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

101

రాజోద్యోగు లందఱు నెట్లు మనఃపూర్వకముగఁ బనిచేయుచుండిరో యాసంగతికూడ నాతనికి స్పష్టముగ బోధ పడియెను.

ప్రజావత్సలుఁడును, ధర్మప్రాణుఁడును,సహృదయుఁడునగు నశోక మహా రాజు స్వయముగ దేశమునందలి స్థితిగతుల నన్నిటిని దెలిసికొని ప్రజాసుఖవర్ధ నముకొఱకును, దుఃఖ నివారణము కొఱకును గావలసిన సదుపాయముల నన్నిటిని గావిం చెను. సామాన్య జనులందఱు ధర్మకర్మములు, సత్కార్యములు మొదలగువానివలనఁ బవిత్రముగ జీవయాత్ర నడపుకొనునట్లు వారివారి కనుకూలముగనుండునట్టి యుపయుక్త కార్యములనుగూడ నశోక మహా రాజు స్వయముగఁ దెలిసికొని సంపూర్ణ ముగఁ గావించి వై చెను.ఈ సకల సత్కార్యములవలన నే లోకమునం దాతనికి ధర్మాశోకుఁ డని విశేష విఖ్యాతి లభియించెను. ధర్మశోకుని చరిత్రాంత రాళమున శ్రీ బుద్ధ దేవుని శాంతిమత ధర్మ పవిత్రాదర్మోను దేశములును, సార్వభౌముఁడగు నాతని సకల పుణ్య క్షేత్ర సందర్శనమును, మహాత్ముఁడగు నుపగుప్తుని సత్సంగమువలనం గలిగిన పుణ్య ప్రభావమును సుప్రసిద్ధము లై విస్పష్టముగ విరాజిల్లు చుండెను.