పుట:ASHOKUDU.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

అ శో కుఁ డు

నానా దేశములను దర్శించి నానాశ్రేణులయందలి నానాజాతి జనులతోఁ గలిసికొనుటవలనం గలిగిన ప్రత్యక్ష ప్రథమఫలమేమనిన – అందువలన నాతని హృదయ మనస్సాంకర్యమంతయు దూరమైపోయెను. త్యాగశీలుఁ డగునశోకునిహృదయము మఱింతయు దార మయ్యెను. ఇట్టి సత్సంగము వలనను, బవిత్ర క్షేత్ర సందర్శనమువలనను, సాధుసజ్జన సంబంధము వలనను, నశోకునకు భూమండలముతోఁగూడ కుటుంబమును వృద్ధియయ్యెను. సాధుసజ్జనమండల మంతయు నాతని కుటుంబమయ్యెను. అశోకునకుఁ దీర్ఘ యాత్రవలన వీసకల సత్ఫలములును సంపూర్ణముగ లభించెను.

తీర్థయాత్రావశమున నాతఁడు తన రాజ్యమునందలి విశేషభాగములను దర్శించెను. ఎచ్చటఁ జెరువులను ద్రవ్వింప వలయునో, యెచ్చట వంతెన లను గట్టింపవలయునో, యెచ్చట సుగమంబు లగురాజమార్గముల నేర్పఱుపవలయునో యాతఁడు స్వయముగఁ జూచీ యుండెను. ప్రజా సామాన్యమంతయు నెట్లు కాలక్షేపము చేయుచుండెనో ప్రజలకృషి వాణిజ్యాదుల యవస్థ యెట్లుం డెనో వారినిత్య నైమిత్తిక క్రియాకలాపము లేవిధముగా నుండెనో యంతయు నాతఁడు స్వయముగఁ జూచి గ్రహింపఁగలిగెను. రాజధానికి దూరమునం దున్న జనపదములయందలి బలవంతులయ త్యాచారములు, దుర్బలు లదురవస్థలును నివారించు విషయమున