పుట:ASHOKUDU.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

అ శో కుఁ డు

గావించిన మహత్తర త్యాగ చరిత్రమునువిని యందఱును శ్రద్ధావంతులైరి. సార్వభౌముఁడగు నశోకుఁ డాస్థలమునఁ గూడ యథాపూర్వకముగ ననేక స్తూపములును, స్తంభములును నిర్మింపఁ జేసి యటనుండి గయా క్షేత్రమునకుఁ బ్రయాణమయ్యెను.

మహా రాజు గయయందలి నిరంజన తీరమునందున్న యురుబిల్వ గ్రామము ను బోధిద్రుమమునుగూడ దర్శించెను. ఉపగుప్తుఁడు సిద్ధార్థునియసాధారణా భ్యాసముంగూర్చియు, నాతని బుద్ధత్వ లాభముం గూర్చియు లలితవచనములతో మహా రాజునకు బోధించెను. ఆ పుణ్యస్థానదర్శనమును, నచ్చటి వారి పుణ్య చరిత్ర శ్రవణమును గావించి మగధేశ్వరుఁ డగు నశోకుఁడు వారణాసీనగరమును గూర్చి ప్రయాణము చేసెను. మహాత్ముఁడగు బుద్ధ దేవుడొకప్పు డుప కాముఁ డనుతత్వజ్ఞునితో నీ కాశీపురముంగూర్చి యిట్లు చెప్పెను. " నేను కాశికి! బోఁగలను. కాశికిఁ బోయి యచ్చట నప్రతిహతంబగు ధర్మసంస్థాపనమును జేయఁగలను” అని——

ఆదినమొకటి: ఈదినము మఱియొకటి. ఆదినమున బుద్ధ దేవుఁడు చెప్పిన “పోఁగలను” అను భవిష్య త్కాలమిక లేదు. ఇప్పుడాతని కాశీ కానగరాగమనము ధర్మచక్ర పరి వర్తనమున నిదివఱకే పరిణత మైపోయినది. ఇంక నచ్చట నాపుణ్య స్మృతి మాత్రమే జాగరత మగుచున్నది. భగవానుఁడగు సిద్ధారుని పవిత్రపదరిజో లేశము చేఁ భావనమైన