పుట:ASHOKUDU.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము

97

క్షేత్రమునందే గడపియున్నాఁడు. బుద్ధ దేవుఁడును, బౌద్ధభిక్షులును, నివసించుటకును, ధర్మ ప్రచారోప యోగము కొఱకును, దాన వీరుఁడును, భక్తశ్రేష్ఠుఁడునగు సుదత్తుఁడను వర్తకుఁడొకఁడు తన జేతవనమును బోధిసత్వునకు సమర్పించి యుండెను. ఆ జేతవన మతిరమణీయమైనది. సుదత్తుఁడీ పరమరమణీయోద్యానమును జేతుఁడను యువరాజునొద్దఁ బదు నెనిమిదికోట్ల సువర్ణ ములకుఁ గొనియుం డెను.

కాని యాయువ రాజు సుదత్తునిధనమును స్వయముగ స్వీకరించి యుండ లేదు. ఆతఁ డాధనముతో జేతవనమునందు బుద్ధ దేవునకును, నాతని శిష్యులకును సుఖోపయోగము కొఱ కును, ధర్మప్రచారమునకు సాహాయ్యముకొఱకును వలయు నేర్పాటులను గావించెను. ఆ జేతవనమునందు భక్తుఁడగు సుదత్తుఁడును, మహాసుభద్ర, కుంతలసుభద్ర యనునాతని తనయలును భగవానుఁడగు బుద్ధ దేవుని సశిష్యముగ సేవించి ధన్య లైరి. బౌద్ధేతిహాసమున శ్రావ స్తీ నగరము స్మృతి వై భవముచేనేమి, వై రాగ్యముచేనేమి, భోగము చేనేమి, త్యాగ ముచేనేమి యనేక విధములఁ బ్రకాశిత మగుచుండెను. ధర్మాచార్యుండును బురాణజ్ఞుండు నగునుపగుప్తుఁ, డాసమస్త వృత్తాంతమును మహారాజునకు నాతనియనుచరులకు నామూ లాగ్రముగ వినిపించెను. బుద్ధ దేవుని యపూర్వమహిమాన్విత చరిత్రమును, శ్రేష్టియగు సుదత్తుఁడు, యువ రాజగు జేతుఁడును