పుట:ASHOKUDU.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

అ శో కుఁ డు

యెను. ఆ యనుభవముతోడనే వారు భగవానుఁడగు సిద్ధార్ధుని వైరాగ్యముం గూర్చి స్మరియింపఁ దొడంగిరి. రూపము, యౌవనము, స్వాస్థ్యము, సుఖము, మహాభాగ్యము మొదలగు సర్వభోగోపకరణములను గరగతము లై యుండినను మహాత్ముఁడగు బుద్ధ దేవుఁడు వానినన్ని టినిగూడ నశాశ్వత పదార్థము లని గ్రహించి స్వేచ్ఛగఁ ద్యజించి వైచి జగత్కల్యాణముకొఱ కాత్మ సమర్పణముం గావించియుండెను. ఆ బుద్ధదేవుని మహానుభావ మెంతటియలోక సామాన్య మైనదియో యా సంగతి ధర్మప్రాణులగు నశోకో పగుప్తులు కపిల వస్తునగరమును దర్శించి సంపూర్ణముగ గ్రహియింపఁ గలిగిరి.

పిమ్మట వారాకపిలవస్తు నగరమును విడిచి క్రమముగా గోణకమున్యాశ్రమంబగు లలితనగరమును దర్శించిరి. అనంతరము వా రచ్చటి నుండి పోయి యథా కాలమున శ్రావ స్తీనగరమునఁ బ్రవేశించిరి. బౌద్ధ భారతమున శ్రావస్తి నగరము వాణిజ్యము, ధనము, భాగ్యము, సుఖసమృద్ధి మొదలగువానియందుఁ బాటలీ పుత్రమునకుఁ దీసిపోవునది కాదు. వాణిజ్యోప యోగమునకై బౌద్ధభారత ప్రధాన నగరములకు శ్రావస్తి నగరమునుండి సుగమంబులగు రాజమార్గములు విశేషించి యుండెను. అంతియ కాదు. శ్రావస్తి బౌద్ధగణమున కొక ప్రధాన " క్షేత్రముగా నుండెను. భగవానుఁడగు బుద్ధుఁడు తన జీవితమునందలి చాలకాల మీ