పుట:ASHOKUDU.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

అ శో కుఁ డు

స్థాపకుఁ డగు బుద్ధ దేవుఁడు నిర్వాణలాభమును బొందియున్నాడు. భగవానుఁడగు సిద్ధార్థు డీస్థలమున నే భిక్షుమండలికంతకును నంత్యోప దేశమును బ్రసాదించియుండెను. ఉపగు ప్తుఁ డశోకున కాచరిత్రమును స్మృతికిఁ దెచ్చి యానందింపఁ జేసెను. బుద్ధ దేవుఁడు తన మృత్యుశయ్యయందు శయనించి యుండి కొలిచియున్న భిక్షు మండలిం గాంచి "ఓ సాధులారా ! సంయోగవశమున నే సకలపదార్థములు నుత్పన్నము లగుచున్నవి; సంయోగవశమున నుదయించు పదార్థము లన్నియు నాశనశీలము లైనవే. ఈ సత్యమును మీ రెల్లప్పుడును స్మరించుకొనుచు సర్వదా సావధాను లై విధాయక కృత్యముల నేమరక నెఱవేర్చుకొనుచుండుఁడు. ఇదియే నా కడపటి యుపదేశము" అని బోధించెను. ఈ సంగతి యశోకుఁనకు జెప్పుచు నా విశాలోన్నత సాలవనంబున బుద్ధదేవుని మహాని ర్వాణలాభ పుణ్యస్థలంబున నిలుఁవబడి యా సిద్ధార్థుని పవిత్ర జీవిత చరిత్రమును గల్పనానయనములతో దర్శించుచు, వానిని మిగుల వర్ణించుచు మహాభ క్తుఁడగు నుపగు ప్తుఁడు భగవానుని యమృతమయ ప్రశాంతో క్తుల నుచ్చారణ చేయ నారంభించెను. అప్పు డచ్చట నున్న వా రందఱి వదనములను నపూర్వభావా వేశ మయ్యెను. మహారాజగు నశోకని కుశీనగర తీర్థ యాత్ర యీ విధముగ సఫలమయ్యెను. అతని మనః ప్రాణములు పుణ్య స్రోతమునఁ బవిత్ర స్నానముం గావించెను.