పుట:2030020025431 - chitra leikhanamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టిసమయమునందు ఆకాశమునకు వివిధ మైనరంగులు వచ్చును. దీనిదగ్గర నున్ననీటియం దీరంగులు వేయవలెను. కాని కొంచెము పలుచగ వేయుట యుక్తము.

ఆకాశమునకును, నీటికిని, పనికివచ్చురంగులు:- కోబాల్టు ఆకాశమునకును, సముద్రమునకును వేయుటకు మిక్కిలి యుపయోగపడును. ఇది ఆఱినతరువాత నీరంగును మార్చుటకు చిందూరరంగును, కావిరంగును వేసిన చాలును.

నీలివర్ణము బ్రౌనుమేడరురంగులోను, కావిరంగుతోను కలిపి వీటికి వేయవచ్చును. పసుపుతో కలిపినయెడల తుపానుసమయమునందు ఆకాశమునకు వేయుటకు పనికివచ్చును.

ఇండిగోరంగును నలుపుతో కలిపిన రాత్రులయందు కానవచ్చుమేఘములకును, దూరముగ నుండుపర్వతములకును, పనికివచ్చును. బ్రౌనుమేడరురంగుతో కలిపిన రాత్రులయందు కానవచ్చిననీటికి పూయవచ్చును. బ్రౌనుమేడరురంగుతోను బరంటుశయనారంగుతోను, కలిపిన గాడ మైనరంగుగలరాళ్లకు వేయవచ్చును.

బ్రౌనుమేడరురంగును, కోబాల్టుతోను, వేండిక్కుబ్రౌనురంగుతోను కలిపిన దూరమున నుండువస్తువులకు వేయవచ్చును. నీలిరంగుతోను, బరంటుశయనారంగుతోను కలిపిన చాయనువేయుటకు పనికివచ్చును.

వెర్మిలియనువర్ణము, ఉదయపు సాయంకాలపు ఆకాశములకు పనికివచ్చును. గోపిచందనపురంగుతోను, కోబాల్టుతోను కలిపినయెడల తుపానుఆకాశమునకు వేయవచ్చును. గాడముగ నుండుమేఘములకు లైటురెడ్డును కలిపిన చాలును. దూరముగ నుండుగృహములకు చిందూరవర్ణమును, బరంటుశయనారంగును, బ్రౌనుమేడరురంగును ఈరంగుతో కలిపి వేయవచ్చును. తేలిక యైనఎఱుపురంగును కోబాల్టుతో కలిపినయెడల మేఘములకు పనికివచ్చును. ఈరంగుపై బరంటుశయనారంగును వేసియెడల గాడత తగ్గును. ఇండిగోరంగుతో కలిపిన ఛాయకు పనికివచ్చును.

గోపిచందనపురంగు ఆకాశమునకును, పడవలకును, ఇండ్లకును, పనికివచ్చును. ఇతరరంగులతో కలిపినయెడల చెడిపోవును. అందువలన నితరరంగులపై నిద్దానిని పలుచగ వేసుకొని రావలెను.

బరంటుశయనారంగు రాళ్లకును, బురదకును, ఇండ్లకును, వేయుట కత్యంతోపకారిగ నుండును. వీనితో కలిపిన మంచిఆకుపచ్చవర్ణము లభించును. కోబాల్టుతో కలిపిన చక్కనిరంగును, నీలితోకలిపిన గాడ మైనరంగునుచ్చును. న్యూట్రల్‌టింటుతో కలిపిన అనేకవిధముల నుపయోగపడును.

బ్రౌనుమేడరురంగును కోబాల్టుతో కలపిన నీడ కుపయోగపడును. ఇండిగోరంగుతో కలిపిన దగ్గరనున్న వాటిఛాయ కత్యంతోపకారిగ నుండును. న్యూట్రలుటింటుతో కలిపిన గాడ మైననీడను చిత్రించుటకు పనికివచ్చును. ఎఱుపుతో కలిపిన ఛాయకును దూరముగ నుండుఎఱుపుబావుటాలకును, దగ్గరగ నుండు ననేకవస్తువులకును వేయుట కుపయోగపడును.

సిపియాను మసిరంగుతోను (Lamp Black) బ్రౌనుమేడరుతోను కలిపిన ప్రదేశచిత్రములయందు పనికివచ్చును.

మసిరంగును బరంటుశయనాతోను బ్రౌనుమేడరురంగుతోను కలిపి ప్రదేశపటములయం దుపయోగించెదరు.

పైరంగులను విద్యార్థులవిషయమై చెప్పితిని. మంచిఅభ్యాసముగలవారు ఇంక నెక్కువరంగుల నుపయోగించెదరు. కాని వారుకూడ ఈరంగులతోనే అభ్యసించి అనుభవశాలులైరి. చిత్తరువులను కొలదిరంగులతోనే చిత్రింపవచ్చును. అందువలన సాధ్యమైనంతవరకు విద్యార్థులు తక్కువవర్ణములనే యుపయోగించెదరు.