పుట:2030020025431 - chitra leikhanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖము బల్లపరుపుగా నుండదు. ఇట్లుండినయెడల చిత్రించుట చాలసులభ మైపోయియుండును. కాని యిది గుండ్రముగ నుండును. అందువలన మనము ఎత్తుపల్లములను చిత్రించి ప్రకృతి ననుసరింపవలసియుండును. ఈయెత్తుపల్లములను చూపుటయేమిగులకష్టము. ఆభేదములను మనము బోధపఱుచుకొనుటకు మీమేజాబల్లలపై తెల్లనిరాతిప్రతిమను సదా యుంచుకొనుట మంచిది. ఇది మనకు మిక్కిలి సహాయకారిగ నుండును.

విద్యార్థి యీదిగువచెప్పినవి మొదట బోధపఱుచుకొనవలసియుండును.

ప్రకృతియందు గలవస్తువులు ఛాయనుబట్టియు రంగునుబట్టియు విడివిడిగ మనకు కానబడును. ఈఛాయ లేనియెడల నన్నియు వివిధరంగులుగల ఒకేవస్తువుగ కనబడును.

వెలుతురునం దుండువస్తువులనీడయం దుండువస్తువులు కొంచెము నల్లగ కానబడును. ఛాయకూడ దట్టముగ నుండును.

దూరముగ నున్నవస్తువులకంటె దగ్గరగనున్నవస్తువులు బాగుగ కనబడును. వీటిరంగులుకూడ దట్టముగ నుండును. దూరము వృద్ధియైనకొలదిని రంగుయొక్క దట్టము తగ్గుచుండును. మధ్య నున్నవస్తువుల సాధారణముగ కానవచ్చును.

దట్టమైనఛాయ నలుపువలెనుండును. గులాబివర్ణపువస్తువుయొక్క ఛాయ ఎఱుపుగ నుండును. వీటియంచులు బూడిదవర్ణపురంగును గలిగియుండును. అంచులయం దుండుబాగములు కొంచెము నల్లగ కానవచ్చును. ఈయంశములను ముఖమును చిత్రించునపుడే అనుసరించవలెను.

రంగులను సిద్ధముచేయుట:- చర్మమును చిత్రించుటకు ఈదిగువ చెప్పినరంగులను విడికుడికలయందు పలుచుగ నరుగదీసి సిద్ధముగ నుంచవలెను.

(1) ఇండియాపసుపు. (2) తేలికయైన ఎఱుపు. (3) వెర్మిలియను. (4) గులాబిరంగు. (Pink Madder) (5) బ్రౌను మేడరు. (6) ఇండియా ఎఱుపు. (7) కోబాల్టునీలి. (8) సిపియా.

ఈపైని చెప్పినవి కాక చర్మమునకు వేయు ఎఱుపు, నీలి, పసుపులతో తయారు చేసికొనియు యుండవలయును. ఎవరియుద్దేశముప్రకారము వారు రంగులను తయారుచేసుకొనవచ్చును. దీని కేమియు నిబంధన లేదు.

కొందఱు పైచెప్పినరంగు నుపయోగింతురు. మఱికొందఱు ఈరంగులద్వారా యితరరంగులను తయారుచేయుదురు. అందుకుగాను కొన్నిశుభ్రమైన కుడకలను మంచిజలమును దగ్గఱ నెల్లపుడు నుంచుకొనుట మంచిది.

ప్రథమతరగతి :- రంగులను వేయుట మూడుతరగతులుగ భాగింపవచ్చునని యిదివఱకే చెప్పియుంటిని. చక్కనిముఖమును చిత్రించుట నీదిగువ చెప్పెదను.

ఇదివఱకు చెప్పినప్రకారము చిత్రమును వ్రాసి రబ్బరుతో నైనను, రొట్టెతో ననను పెన్సిలుతో గీతలు వేయవలెను. కాని కొంచెము గీతలు కనబడుచుండవలెను. ఇటుల చేసినయెడల యీగీత లేమియు------- తరువాత కానరావు. పిమ్మట కుంచెతో ముఖ్యమైనచోట్ల రంగులు వేయవలెను. ఇటుల ప్రథమ----------- యెడల పెన్సిలుగీతలయవసర ముండదు. సిపియాతో కనుబొమలను, కోబాల్టుతోను సిపియాతోను------------ వేండిక్కుబ్రౌనురంగుతో కంటిపాపను చిత్రించవలెను. బ్రౌనుమేడరురంగుతో నాసికయొక్క -----------చిత్రింపవలెను. చేతినికూడ యీరంగుతోనే చిత్రింపవలెను. బ్రౌనుమేడరురంగుతోను, గులాబిరంగుతోను----------- ధ్రములను నోటియొక్క మధ్యభాగమును చూపవలెను.

పిమ్మట చర్మపురంగును ముఖమునకు వేసి తేలి యైనఎఱుపురంగును కోబాల్టును కలిపి ----------నాసికక్రిందను గడ్డమునకును చెవికిని యివ్వవలెను. కోబాల్టుతో క్రిందిపెదవిదిగువనను చిత్రించవలెను.