పుట:2030020025431 - chitra leikhanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలుగదు. చిత్రమును వ్రాయునపుడు దగ్గర నెవరు నుండకూడదు. స్త్రీయొక్క ప్రతిరూపమును వ్రాయునపుడు మాత్రము మఱియొక మనుజుడైనను స్త్రీయైన నుండినయెడల నపవా దేమియు రాదు.

చిత్రములను వ్రాయుట:- మొదట మంచిప్రతిరూపమును పెన్సిలుతో వ్రాయవలయును. ముందు చిత్రింపబోవుచిత్ర మంతటికిని యిది యాధార మైయుండును. అందువలన పెన్సిలుతో వ్రాయుచిత్రమునందు తప్పు లున్నయెడల కష్టమంతయు వృథా యైపోవునుకదా! కాన దీనిని శుభ్రముగ పెన్సిలుతో వ్రాయుటయం దెంతకష్టమైనను పడవలెను.

పెన్సిలుతో వ్రాయునప్పు డనేకచోట్ల రబ్బరుతో చెరుపవలసియుండును. అందువలన కాగితము చెడిపోవును. దానిపై రంగును వేసినయెడల చాల దట్టముగ నంటుకొనును. ప్రథమమున నొకకాగితముపై చిత్రమును వ్రాసి మఱియొకకాగితముపైకి దానిని దించవలసియుండును. ప్రస్తుతము చిత్రమును వ్రాయుటను చెప్పెదను.

తలయొక్కస్థితి నొకగీతవలన తెలియజేయవలెను. పూర్ణముఖ మున్నయెడల తిన్ననిగీతను కొంచెము ప్రక్కకు త్రిప్పియున్న ముఖమునకు కొంచెము వంకరగీతయు వ్రాయవలసియుండును.ఈగీతకు సమకోణముగ నొకగీతనువ్రాయవలెను. ఈరేఖ కండ్లమధ్యద్వారా వెళ్లవలెను. ఈవిధముననే మెల్లగ ముక్కునకును, నోటికిని, గడ్డమునకును గీతలను గీయవలెను. వీటిసహాయముద్వారా ముఖముయొక్క రూపమును 33 - 2లో చూపినప్రకారము వ్రాయవలెను.

పిమ్మట చిత్రములను చక్కజేసికొని రావలెను.

ఈచిత్రము ముఖమునకు సమానముగ నున్నదో లేదో చూడవలసియున్నది. దీనికిగాను నీచిత్రమును ఒక అద్దమునందు ప్రతిఫలింపజేయుము. ఏమైన తప్పున్నయెడల వెంటనే తెలిసిపోవును.

తరువాత నాచిత్రముమీద నొకపలుచని కాగితమును వేసి కదలిపోకుండ పెంసిలుతో కాగితముద్వారా కనబడుచున్నచిత్రము నాపలుచనికాగితముపై వ్రాయుము. ఈవిధముగ మీరుచిత్రమును మఱియొకకాగితముపై ------- గలుగుదురు. ఇది యిట్లుండ నొకదళసరికాగితముపై గోపివందనపురంగును దట్టముగపూసి అదియూరిన --------- చిత్రమును తీసి దీనిపై వేసి పెన్సిలుతో గట్టిగ దిద్దవలెను. ఇటుల చేసినయెడల నీచిత్ర మున్న -------- గోపిచందనపుగీతలతో మఱియొకప్రతిరూపము వచ్చును.


నీవు చిత్రమును వ్రాయదలచితివో ఆకాగితముపై జాగరూకతతో నీచిత్రము నుంచి దానిపై ------------ కాగితముపై నంటుకొనును. అప్పు డీకాగితమును జాగరూకతతో తీసివేయవలెను. --------------పెన్సిలుతో నారంగు ననుసరించి చిత్రమును వ్రాయవచ్చును. చేతిరుమాలతో నీరంగును తుడిచి ------------- ప్పుడు నీచిత్రము రంగులువేయుట కనుగుణముగ నుండును. గోపిచందనమురంగు పూసినకాగిత-----------చినయెడల మఱియొకపర్యాయమునకు పనికివచ్చును. కాని యీమార్పులయందు చిత్రముయొక్క-----------పాడుచేయరాదు. పైజెప్పినదంతయు డ్రాయింగు కాగితమును శుభ్రముగ నుంచుకొనుట------------ వలన నభ్యసించినవారు కాగితమును శుభ్రముగ నుంచుకొందురు గాక. గొప్పచిత్రకారు లీవిధము------------చున్నారు.

ప్రథమమున వ్రాయు చిత్రమును పెద్దదిగనుచిన్నదిగను చేయుటకు యిదివఱకే యుపాయములను చెప్పినప్రకారము చిత్రకారులు తమతమ యిష్టములప్రకారమును, స్థితిగతులనుబట్టియు, తమచిత్రములను కాగితము యందు వ్రాసుకొనవచ్చును.

రంగులు పూయుట:- ఒక గొప్పచిత్రకారుడు "మొదట వెలుతురు పడినచోట్లయందు తెలుపును,-----------పచ్చను, తుదిని గాడమైన ఎఱుపును ఛాయ ననుసరించి వేయవలెను. ఎచ్చట ఛాయ దట్టముగ -----------గ్రేవర్ణమును పూయవలెను" అని చెప్పెను.