పుట:2030020025431 - chitra leikhanamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖమునందలి వివిధభాగములు పెద్దవిగ కనబడునో యట్టివానిముఖమును పూర్ణముగ వ్రాసిననే బాగుగనుండును. కారణ మేమన: పూర్ణముఖమును వ్రాసినయెడల వదనమునందలి యంగవికారము చాలవఱకు కప్పుపడిపోవును. సాధారణముగ కొంచెము ప్రక్కకు తిరిగియున్నముఖమును చిత్రించెదరు. ఏలయన: యిట్టిచిత్రమునందు పూర్ణముఖమును, ప్రక్కకున్న ముఖమును ప్రదర్శింపవచ్చును.

33- 1లో చెప్పిన యాకారము నెంచుకొనుటకు మిగుల జాగరూకత వహింపవలయును. ఎడమవైపునకు త్రిప్పినటుల చిత్రించవచ్చును. కాని ఏవైపునకు త్రిప్పినటుల వ్రాసినయెడల సౌందర్యముగ నుండునో చూచుకొనవలెను. దీనికి నేను చెప్పుకారణ మిది. ప్రతివాని ముఖముయొక్క రెండువైపుల నొకేవిధముగ నుండవు. ఒకవైపు మఱియొకవైపుకంటె సౌందర్యముగ నుండును. ఈసౌందర్యపువైపునే మన మెంచుకొనవలెను.

ఒకముఖముయొక్క యాకారమును చూచిన చాలదు. తలయొక్క స్థలమునుకూడ చూడవలయును. తల వెండ్రుకలే ముఖమునకు సౌందర్యము నిచ్చును. అందువలననే మనము కాపింగులను, గేరాలను ఉంచెదము. స్త్రీలు కురులు నెంతో యానందముతో పెంచెదరు. వారు జడను వేయుదురు. జుట్టు ననేకవిధముల కట్టెదరు. ఐరోపా దేశపుస్త్రీలు జుట్టు ననేకతరగతుల వంగునటుల చేసెదరు. ఈశిరోజములు ముఖమునకు సౌందర్యము నిచ్చు ననియే కదా మనము వాని నింతయాదరించెదము. అందువలన తలయొక్కసమస్య చాలముఖ్యమైనది. తల యేస్థితియందుండిన బాగుగ నుండునో చిత్రలేఖకుడు చూడవలెను. ఇది వయస్సునుబట్టియు, జాతినిబట్టియు, ముఖవర్చస్సును బట్టియు ఉండును.

చేతులు యిట్టిచిత్రములకు చాలసౌందర్యమును కలుగజేయును. వ్యక్తిని చూచి వీటిని వ్రాయుట యవసరములేదు. చిత్రకారుని యిచ్ఛప్రకారము ఈహస్తంబులను సౌందర్యముగవ్రాసి చిత్రమునకు వన్నె తేవచ్చును. రేఫేలే (Raflaelle) చిత్రకారుని యుద్దేశము ప్రకారము రెండుచేతులను చూపుటయే మంచిది. చిత్రలేఖకుని బుద్ధికుశలతనుబట్టి వీనిని వ్రాయవచ్చును. రెండవచేయి యేమయినదని యితరులడుగుటకు సందీయరాదు. పెన్సిలుతో వ్రాయునపుడే పైవిషయముల నన్నిటిని గమనింపవలెను. సగమురంగులు వేసినతరువాత విచారించినయెడల లాభమేమి? చేతులు కాలినతరువాత నాకులను వెదకిన వ్యర్థమేకదా?

దుస్తులు:- దుస్తులు నాగరికతనుబట్టి ప్రతినిమిషమును మాఱుచుండును. కురుల నటుల జాగరూకతతో పోషించెదమో దుస్తుల నటులనే యతిజాగరూకతతో ధరించెదము మంచి విలువగల శుభ్రములైనబట్టలను వేసికొనుటకు సదా కోరుచుందుము. ఇట్టిసౌందర్యమును కలుగజేయు బట్టలవిషయమై మనము కొంచెము నేర్చుకొనవలసియున్నది. దుస్తులతీరు ప్రతినిమిషమునను మాఱుచుండును. ఇప్పుడు మనకు సౌందర్యముగ కనబడునవి యిరువది సంవత్సరములపిమ్మట వికారముగ కానవచ్చును. ఇంతకుముందు దుస్తులతీ రెట్లుండునో కొంచెము చూచిన మంచిది. వివిధకాలములయందు మనుజు లెట్టిబట్టలను ధరించియుండిరో వ్రాయవలసియుండును.

మనహిందూడేశము బాల్యదశయం దుండినప్పుడు మనుజులు అడవులలో నివసించి ఆకులను ధరించుచుండెడివారు. వా రనేకవిధముల నభివృద్ధిజెంది వస్త్రములను నేయుట కనిపెట్టిరి. ప్రథమమున కౌపీనములను ధరించి పిమ్మట వస్త్రము నొకదానిని కట్టి దేహము నొకబట్టతో కప్పుకొనుచుండిరి. పిమ్మట పట్టువస్త్రములను నేయ మొదలిడిరి. ఆహా! ఆకాలమునందు హిందూదేశ మెంతయభివృద్ధియం దుండెను? అన్నిదేశములకును, విలువగల వస్త్రముల నెగుమతి చేయుచుండెను. కాని వారు మనవలె కోటులను, షర్టులను, పంట్లాములను పరదేశములయందు నేయబడు బట్టలను ధరింపలేదు. వారుగాక మనమా దేశభక్తులము? గ్రీకులదండయాత్ర మనవస్త్రములయందు