పుట:2030020025431 - chitra leikhanamu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈకళకు యిదివరకు చెప్పిన ఛాయయే ముఖ్యము. ఛాయ నిచ్చుటయందు తప్పిపోయిన కళగూడ తప్పిపోవును. కన్నులయందును, నోటియందును, నేమైనతప్పున్నయెడల కూడతప్పిపోవును. ఛాయాపటములను పెద్దవిగ వ్రాయుట యింక రెండువిధము లున్నవి. 23 - 3, 4 చూడుము.

2030020025431 - chitra leikhanamu.pdf

ఈ చిత్రములయందు కనబఱిచియున్నటుల కోణములను వ్రాసి పెద్దవిగ చేయవచ్చును. మూలచిత్రమునందు వ్రాసినప్రకారము కోణములను వ్రాయవలెను. కొప్పునకును నొసటికిని విడదీయుభాగమువద్దనుండి గడ్డముకొనకును "కగ" యను గీతను వ్రాయుము. ముక్కుచివర భాగమును "ఖ" యని పిలుతుము. "కఖ" లను "గఖ"లను గీతలుద్వారా కలుపవలయును. "కఖ" ను కొలిచి దానిని కొన్నిరెట్లు పెద్దదిచేసి మనము వ్రాయదలచుకొన్న కాగితముమీద నొకగీతను గీయవలెను. తరువాతను "గకఖ" "కగఖ" యను కోణములను కొలిచి "ఖగక" యను త్రిభుజాకారమును వ్రాయవలయును. ఏమాత్రము కొలతలు తప్పినప్పటికిని రూపమంతయుచెడిపోవును. ఈగీతలసహాయమునుబట్టి చిత్రమునువ్రాయుట సులభము. అటులనే చిత్రము నంతటిని పూర్తిచేయవచ్చును.

తిన్నని ముఖ మున్న యెడల దానిని రెండు సమభాగములుగ చేసి సులభముగా వ్రాయవచ్చును. ముఖమును భాగించుగీత మనకు మిక్కిలి సహాయకారిగా నుండును. రెండుకన్నుల కొనలను ఒకగీతద్వారా కలుపును. అది "కఘ" గీతను "క" వద్ద కలియుచున్నది.

తరువాతను నీవు వ్రాయవలసిన కాగితముమీద నొక గీతను గీచి దానియందు "క" యనుచుక్క నొకదానిని పెట్టుము. తరువాత "గకఘ" యనుకోణమును "కగ"ను కొలిచి నీ కాగితమునందు గీయుము. ఈగీతను నీయొక్క యుద్దేశముప్రకారము పెద్దదిగనో చిన్నదిగనో వ్రాయవచ్చును. ఈలాగుననే "కఖ" యనుగీతలుకూడ వ్రాయవలెను. తరువాత కన్నులను వ్రాయుట చాలసులభము. 23 - 5 చూడుము.

ఇవ్విధముననే తక్కినయంగములన్నియు వ్రాయవలెను.

మొదట చెప్పినప్రకారము మనము దేశపటములను వ్రాయవచ్చును. మూలపటమున నున్న అక్షాంశలును, దేశాంతరాంశలును పెద్దవిగనైనను చిన్నవిగ నైననువ్రాసికొని దానినిబట్టి పటము పై చెప్పినవిధముగ వ్రాయవలెను.