పుట:2030020025431 - chitra leikhanamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన మేదైన జనసమూహమును వ్రాయవలసివచ్చినపుడు మనుజులంద ఱొకేవిధముగ నిలువబడినటుల వ్రాసిన ప్రకృతిరూపము ననుసరించి యుండును. అందువలన ననేకవిధములైన రూపముల ననుసరించి వ్రాయుట నభ్యసింప వలయును. 21 చూడుము.

ఇచ్చట నచ్చువేసిన ప్రకారము తలల నభ్యసింపవలెను. మొదటిభాగమునందు మనుజునాకార మెటుల వ్రాయుటయో చెప్పియుంటిని. ఇట్టి స్థితి యందటుల వ్రాయక మీరు మనుజుల నెటుల చూచెదరో యటుల నభ్యసింపవలెను.

కొన్ని సమయముల యందు పరుగెత్తుచున్నటుల మఱి కొన్ని సమయముల యందు నిలుబడినటుల ఇతర సమయములయందు పనిచేయుచున్నటుల వ్రాయవలసివచ్చును.

స్త్రీలు కోమలశరీరలు. వారి యంగములు పురుషుల యంగములవలె నుండవు. ఇవి యెట్లుండునో చూచిననే బోధపడునుగాని వర్ణించుట నాతరము కాదు. పురుషుల శరీరములందు నరములు కనబడు చుండును. స్త్రీల యంగములయం దటుల కనంబడవు. పురుషుల స్నాయువులు పైకి కనబడును. స్త్రీలవి కనంబడవు. ఇట్టి భేదములు బహు జాగరూకతతో గమనింపవలెను.

పురుషుల ముఖములకును స్త్రీల ముఖములకును అనేక భేదము లుండును.