పుట:2030020025431 - chitra leikhanamu.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ భాగము.

ప్రదేశ చిత్రలేఖనము.

మొదటి ప్రకరణము.

మననేత్రములు గొప్పయంత్రములు. ఇవి లేని జీవనమెందుకు? మనుజులు తమచాకచక్యమునుబట్టి వీనినుపయోగించదరు. ఒకమూర్ఖునియెద్దనొక సుప్రసిద్ధచిత్ర ముంచినయెడల "ఇది బాగుగలేదు. రంగులు దట్టముగ నుండిన బాగుగ నుండును" అనును. దానినే యొకచిత్రలేఖకునియెద్దునుంచిన నెంతో యానందించును.

మనమేదైన ప్రదేశమును (Landscape)చిత్రింపవలెనన్న చాలజాగరూకతతో నొకదృష్టము (Scene) ను ఎంచుకొనవలెను. అది చూచుట కానందకరముగ నుండవలెను. ఇందుకు మనుజునకు చిత్రలేఖనాభ్యాసము ముఖ్యము. మనయభ్యాసమెక్కువైన కొలది మంచి దృష్టములను ఎంచుకొనుశక్తి గలుగుచుండును. మనమేదైనా చూచునప్పుడు ఒక గుండ్రని దృష్టము దృగ్గోచరమగును.

18 చూడుము

కాని మనము దీనిని వ్రాయునపుడు మొదట దృష్టి మట్టపుగీతను నిర్ణయింపవలెను. దానింబట్టి మనము చిత్రమును వ్రాయవలెను. ఈ గీతకు పైనున్న వస్తువుల దిగువ భాగము కాన్పించును గాని పైభాగము కాన్పింపదు. దానికి దిగువునున్న వస్తువల పైభాగము ప్రధానముగ కాన్పించును. అందువలన ఈగీత చాలా ముఖ్యమైనది. 18 చూడుము

వ్రాయునపుడు పెద్దవస్తువలను మొదట వ్రాయవలెను. తరువాత చిన్నవస్తువులను లిఖింపవలెను. ఇవన్నియు వ్రాసినతరువాత వెనుకభాగము (Background) ను వ్రాయవలెను.

మనకు దగ్గరనున్నవస్తువులు చక్కగ కాన్పించును. దూరమున నున్నవస్తువు లంతస్పష్టముగ కాంపింపవు. దీనింబట్టి మనము వ్రాయుగీతలదట్టము మారుచుండును. ఇంకొకసంగతి గమనించవలసియున్నది.