పుట:2016-17 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై సిఎజి నివేదిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధ్యాయం 1 - రాష్ట్రప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు



1.3 బడ్జెట్ అంచనాలు, వాస్తవ విలువలు

కీలక ద్రవ్య పరామితులకు బడ్జెట్ అంచనాలు, వాస్తవ విలువలు చార్టు 1.1లోనూ, ఆనుబంధం 1.4లోనూ చూపడమైంది.

చార్టు 1.1; బడ్జెట్ అంచనాలు - వాస్తవ విలువలు


రెవెన్యూ ఖర్చు (71,16,215 కోట్లు) బడ్జెట్ అంచనాల కంటే (71,14,168 కోట్లు) 1.79 శాతం పెరిగింది. బడ్జెట్ అంచనాలను మించి చేసిన ఖర్చు యూడీఏవై పథకంతో కలుపుకొని అత్యధికంగా విద్యుత్ రంగంలో (210.97 శాతం) ఉంది. బడ్జెట్ అంచనాల కంటే (15,388 కోట్లు) క్యాపిటల్ పరివ్యయం 1.59 శాతం (15,143 కోట్లు) తగ్గింది.

1.4 ద్రవ్య సంస్కరణల పథం

పన్నెండవ ఆర్థిక సంఘం (టిఎఫ్) సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 'ద్రవ్య బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆరబీఎం) చట్టం-2005' అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టానికి 2011లో సవరణ జరిగింది. 2011లో సవరించిన ఎఫ్ఆరబీఎం చట్టం-2005 సారాంశం అనుబంధం 1.5లో ఇవ్వడమైంది. ద్రవ్య చరాంశాలకు సంబంధించి ముఖ్యమైన లక్ష్యాలు పట్టిక 1.3లో చూపడమైంది.

పట్టిక 1.3:ద్రవ్య చరాంశాల లక్ష్యాలు/అంచనాలు

పేజీ 3