పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

37. హనుమద్విక్రమము:

సీ॥ ఉబికితివేని నస్తోర్ద్వ లోకంబులు
                గిరగిర నుడివడి తిరుగుకున్నె
     త్రొక్కితివేని యదో భువనము లెల్ల
                దట్టముగా నట్టగడ్దుకున్నె
     యూదితివేని మహాదధు లన్నియుం
                  జిఱుతుంపురై మింట జెదరకున్నె
    గ్రుద్దితివేఇ మేరుధరాదరం బైన
                   మఱి తుములై ముచ్చమాయకున్నె
       సత్యసంకల్పుడవు మనోజవుడ వీవు
       కామరూపి వప్రతిహతగతిని నెవు
       నీ మహత్వ మొకింతయు న్నీవెఱుగవు
       గాని హనుమంత:నీవు సాక్షాచ్చివుడవు.

38. కుంభకర్ణుడు:

     సీ॥ సంజకెంజాయచే నంజనాచల మటు
                  కానిదుస్తుల నీలకాయ మమర
          నిరుగడ మేరుశిఖర మినచంద్రుల
                 వలె దలకుండలంబులు వెలుంగ
          గ్రొమ్మెఱుంగుల తోది క్రొక్కారు మబ్బట్లు
                  తారహారముల నెద నెత్త
          గొండల న్మల్లెపూచెండుల గతి నెత్త
                  జాలిన శూలము కేల దనర
            ప్రళయభైరవువలె దాండవము సలుపుచు
            నట్టహాస మశవిశబ్ద మవహసింప
            గోటగోడ నొక్కడుగున దాటి కుంభ
            కర్ణు డేతెంచె గవులు నల్గడలబాఱు