పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
26

దా స భా ర తి

   కెంగేలు గలిపిన సింగారపు పచారు
          నడ్గడ్గున నివాళి నందు పౌరు
   అఱకోర్మి మడుపుల నందించుకొను నేర్పు
           నిముసమ్ములోన వేసముల మార్పు
   ఇక్కువల బువుచెండ్లేయు జాణతనంబు
            నెగనక్కెముల మొల్కనగుల డంబు
        గడుసుముద్దు వినీవినపడని సుద్దు
        కన్నుమెలపు కడు న్గుత్తకొన్న వలపు
        క్రొత్త యాలుమగలు గయికొన్న వగలు
        పూని గడియించు టెటు నల్వయైన గాని.

33.వనవాస రాజభోగము:

సీ॥ ధరణి తివారి, వితానము విను, వ్రేల
        బడు దీపగోళము లుడులు వెల్గు
     చూపెడు దివిటీలు సూర్యచంద్రులు, కొండ
          గాలి అంత్రము, తలగడలు రాలు,
     సౌధరాజము పర్ణశాల, కార్కెకములు
         ద్వారపాలురు, మంటియరుగు గద్దె,
     కరములు బంటులు, కాళ్ళు గుఱ్ఱములు, దుం
          పలు భోజనము, చేతుపట దుసు,
     జడలు సొమ్ములు, ధర్మరక్షణము ధనము,
     దుర్గము గుహ, యధాలాభతుష్టి మౌళి,
     శమము మిత్రము, శుద్ధసత్వము సచివుడు
     యడవి రాజ్యము, మఱి మన మధిపతులము.