పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

దా స భా ర తి

      లోనికిం బైటి కూర్పు పుల్గులనులాగ
      నరకపాల ముక్తాభరణంబు లెనగ
      నగ్నికుండము లట్లు రక్తాక్షు లలర
      వచ్చి తాటక పిడుగులుపడగ బల్కె

30. తత్త్వము:

గీ॥ లేని దున్నయట్లు లీలకై తలపోసి
     పురుషు డందు బంధమోక్షములను
     బిల్లకాయ మాడ్కి నెల్ల జగం బిది
     వచ్చు బోవు నతని యిచ్చకొలది.

గీ॥ ఎటుల భావింప నటు తోచు నిజ్జగంబు
     ఆత్మ తప్ప మఱే వస్తువైన లేదు.
     కలుగు దనయంత జ్ఞాన మజ్ఞానమట్లు
     శాశ్వతంబగు నాత్మకు సహజమిది.

గీ॥ కలదనిన లేదు, లేదన్న గలదు జగము
     నభమునందున గన్పడు నల్పు మాడ్కి
     నిర్గుణుడు విత్యు డాత్ము డనిశము ప్రకృతి
     నంట డంటియు నీ రామరాకు వలెను.

31.ప్రభాతము :

సీ॥ తప్పు బయల్పడ్డ చొప్పున నోడిన
            వెరపున: జంద్రుడు వెల్లబాఱె