పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
20
దా స భా ర తి

    తప్పుబల్కుట గాక సత్యమున దరమె
    యజునకై నను మఱి వాని యబ్బకైన

8. మార్కండేయ చరిత్ర

                     --------

26.అభ్యుదయాభాసము:

సీ॥ జనులార మన పిన్నతనమున మనకు గ
          ల్గిన హాయి, యాప్పటి మన యవస్థ
     గనుగొంటిరే వాడు కనులకు జీమప్రా
           కుట సైత మెంతయో గొప్ప చోద్య
     ముగద యెంతటి యాకలి గొనియైనం జప్ప
          టులు విన్నయంత నేడ్పు దొలగుగద
     నేడు మోదము సేయ నేరవెవ్వియు మన
          చూపులకైనను శ్రుతులకైన
      వక్కటా: యీడుతోడుత నాసపురుగు
      పెరిగి చెలరేగి సంతుష్టి తెరచుచుండె
      జ్ఞాన మేపారె సజ్జాన మనుచు
      జెప్పుకొనుటకు లోలోన సిగ్గుపుట్టె.

27. మనుషుల పోక్లి

గీ॥ ఎఱ్ఱచీర జూచి వెఱ్ఱియెనలు బెట్టి
     పరుగులిడుచు నార్చు బ!ఱ్ఱెబోలి
     ప్రతిభ గాంచి యోర్చు ప్రాజ్ఞత లేమి బై
     కుబ్బిన శక్తిహీను లుల్కుచుండ్రు