పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16
దా స భా ర తి

6.భీష్మ చరిత్రము

                ----

21. కర్తవ్యబోధ:

    సీ॥ పనుల జన్నమున జంపగనేల నాకలి
                 గొన్న భూతామ్ముల కన్న మిడుడు
          నోరునొవ్వగ వేదపారాయణము లేల
                 నందఱిమ్రోల సత్యము పలుకుడు
          తీర్ధయాత్రల డస్సి తిరుగులాడగనేల
                  నార్తులకెల్ల సహాయపడుడు
          సన్యాసిభిక్ష నెంచగనేల మనకోటి
                  పాటివారలకునై పాటుప్;అడుడు

         ఎందుకిక వేయిమాట లీ యలను సర్వ
         జనుల కుపకారముగ నడువని మనుజుడు
          జపతపంబులు నిష్టలు సలుపుటెల్ల
          బూడిదంబోయ పన్నీటి పోల్కిగాదె.

సీ॥ బ్రతికియున్నంతకు స్వర్గనరకముల
             సంగతి దెలియ నసాధ్యముగద
       తరలినవారలు పరలోకవార్తల
            జెప్పినా మనతోడ నెప్పుడైన
       మర్త్యుల నోళ్ళలో మలయ వేదములకు
            గనగన నొక ముక్కుమొనయు గలదె