పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుసరణ పేరిట మూలవిధేయ సాద్వనము వలదు. ఈ అనువాద ధర్మముల కనుగలముగనే యున్నది దాసుగారి కృషి. స్వతంతకృతి ప్రణేత యైననాడు అనువాయిత యైనచో అత డెదిరి కౌశలమును గుర్తింపగలడు, తన కౌశలం దాచుకొనలెడు, ఆ యనువాదము రాణించును అని నిరూపించినా రాయన.

  ఆ మహాకవికి రసికాబరవికి నా జోహారు.
    సుమారు రెండేండ్ల క్రిందటా ఈ గ్రంధమున్ సంకల్పించి రూపొందించితిని. ఇద్దరు పెద్దల ధర్మమా యని యిప్పటికి వారి అర్ధభాగ్యము లభించి నాకామ్య మీడేరి దీనికి మోక్షము వచ్చినది. 'తడవర్తి ' యింటి పేరుగాని అదిగినదే తడవుగా తడవు సేయక ముందుకు వచ్చిన రసజ్ఞశేఖరులు శ్రీ బసవయ్యగారు "దానభారతీభార ధూర్వహులలో నే నొకడను" అని సగర్వముగా చెప్పుకో గలిగిన ఈశ్వరరావు గాదు అన్న మాట యందు మాత్రము యింటి పేరు నిలబెట్టుకొని వన్న పూసవంటి మనసుతో నావెన్ను తట్టి బసవయ్యగారితో జట్టుకట్టి యీ ప్రచురణ బారము నిర్వహించిరి.  ఆప్తమిత్రులు, సహృదయ చక్రవర్తులు ఆ యిరువురకును నాకృతజ్ఞతా కుసుమాంజలి.
     ముద్రణ ఎవరి యేమరుపాటు వల్ల నైతేనేమి కొలది దోషములు లేక పోలేదు. అయితే ఏమంత దారుణము లైనవి కావు. త్వరలో దీనికి ద్వితీయ ముద్రణ భాగ్యము లభించునన్ ఆశగలదు. అప్పుడవి సవరించును.
     ఈ గ్రంధ ముద్రణము నుచితముగా ప్రారంభించిన శ్రీ ఉషశ్రీ ప్రింటర్సు వారికిని, మధ్యలో ఆదుకొని, అచిరకాలమున దీని నింత సర్వాంగస్ందరముగా తీర్ఫి దిద్దిన సహృదయులు నెల్ కం ప్రెస్ మేనేజింగు డైరెక్ట్రరు శ్రీ యస్. పాండురంగారావు గారికిని నసౌహార్ధ సాధువాదములు.

           'నాయని నాల్గు మోము లవునా యెటు ముద్దిడె?' దంచు నల్వ యా
          ప్యాయముగా హసింపగ, 'అనంతములను నను నేట్లు ముద్దిడం
          బోయదొ !' యంచు జెల్వ నగ. "ముద్దిడెదను గను ' మంద నల్వ నా
          రాయణదాసు గాగ ద్రవనందు సరస్వతికిన్ నమస్కృతుల్.
                                                            యస్వీ జోగారావు