పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆయా గ్రంధముల గురించి వివరములకు అనుబంధము-3 చూడనగును. ఇక వారి అనువాద విధానము గురించి కించిత్సమాలోచనము:- 1. సంస్కృతము ననువదించు పట్టును అచ్చతెలుగునే ఉపయోగింతు రని వారి శపధము. భషాంతరీకరణమున మూలభాషాశబ్ధములను ముట్టగూడ దన్నది వారి నియమము. ఋక్కుల ననువదింపునపుడు వానిని స్వరపరిచి వీణపై వాయించి చూచుకొని వాని గీతి ధర్మంఊణాఖూ దగినట్లు మంజరుల నెక్కువగా వాడిరి. ఆ వైదిక సంస్కృతము లౌకిక సంస్కృత విద్వాంసులకే కొంత వింతగా నుండునేమో గాని దాసుగారి నాటుతెలుగు మాత్రం ప్రౌడాంద్ర ప్రబంద భాషావల్లభులకును, సామాన్యులకు సరేసరి, సులభ గ్రాహ్యముగా నున్నది. (చూ.పుట. 100) లౌకిక సంస్కృతానువాదమున మరీ లాఘవమును జూపిరి దాసుగారు. "యదాలోకే సూక్ష్మం ప్రజతి..." అను అంత పెద్ద శాకుంతల శ్లోకము (93):-

         కం. చిన్నది పెద్దదిగా, విడి
              యున్నది కలిపినటు, వంక నురునది సరిగా
              జెన్నారు దవుల జెంగట
              గన్నుల బడ దెద్ది తేరు కడువడి బోవన్.

అను చిన్న పద్యముగా అవతరించిన దనువాదమున అయిననూ మూలభావ మూచముట్టుగా వచ్చినది. అటనున్న పదములన్నియు చిన్నచిన్నవి. సమాసముల అట్టహాసము లేదు. పద్యపు నడక నల్లేరుపై బండి, అర్ధావగతి కరతలామలకము, 'వేదాంతేను ' అను శబ్దసంపుటికి 'ప్రా జదువుల కొనల ' అని అర్ధము నాశ్రయించి యనువాదము. 'భక్తియొగ ' మనుటకు "బత్తిజోగ" మని తేద్బవ రూపకల్పన. "కుసుమ ప్రసూతీ అను దానికి "పువ్వు సమర్త" అని మనోజ్ఞమైన మార్పు. కాళిదాసుని యౌవన నిర్వచనమ్లు. "రాగబంధ ప్రవాలము", "విలసిత పదమాద్యం" అనువానికి 'తగులు తలిరు ', 'హొయలు తొలిటెంకి ' అను పేదబంధము లనువాదము సంజ్ఞ నస్వర్ధ మొనర్చినవి. అనువాదము నందలి యీ క్రింది పదములు తెనుగు నుడికారము విగారమును స్ఫురింపజేయుచున్నవి: వామనమఱుగుజ్జు, పరాజ్ముఖ-పెడమొగము, అతర్కితోపసన్నం-కోరనట్టి కోర్కె, లక్మీం తనోతి- మెఱుగునిడు, శరీరం-బొంది, అర్క:-జగము కన్ను, ప్రతిబోధనక్య:-నెఱజాణల, పరితాపం-పలవంత, ఆయా పద్య సందర్బములు పరిశీలించినచో వీని సార్ధకత మరింత మెచ్చుకొల్పును.