పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాకుజూడ భక్తియందును వ్యక్తిత్వమునందును దాసుగారియందు పోతనత్వ మెక్కువగా ప్రతీయమానమైనను భాషయందును శైలియందును చందస్సునందును తిక్కనతనమె యెక్కువ యనిపించును. ఆ మూటి లక్షణముల నా భీష్మ సంగ్రామ పద్య మచ్చముగా తిక్కనగారి దనిపించును.

అనువాదప్రజ్ఞ :

   ఈ పరిసోక్తి మొక డిమ్ముల సంస్కృతభాష నచ్చుగా,
   జేసిన నట్ల వీడు మఱి చేయుట యేటిదిల్ యంచు జెప్పగా
   జేసి యనాదరం బురక చేయకుడీ. విలుకాడు తూటుగా
   నేసిన పంచె పాఱ మఱి యేసిన నావిద మాటి గావునన్.

అని కొఱవి గోపరాజకవి అనువాదయితృ కౌశల ప్రశస్తి నెపుడో ఛేసియుండెను. అర్ధవంతమైన మాట యది. గురి నేర్పరిచినవాడు మొదటి విలుకాడే కాని గురిచూచి యేచిన రెండవ వానిదే సూటి. అనువాదకరణమున స్వతంత్ర రచనలో నుండు వెసులుబా టుండదు. అందుచే అనువాదమున నెగ్గినవాడు పెద్ద నేర్పరి క్రిందనె లెక్క:-

  దాసుల్గారు భాషాదేవి భక్తులలో అగ్రగణ్యుడు పుట్టగోచులు పెట్టిన పూటనుండి వరుసగా సంస్కృతాంధ్రములు, ఆంగ్లము, అరబ్బీ, పర్షియను భాషలలో వ్యాసంగము సేచుయు అందు విశేషప్రజ్ఞ నర్జించిరి. సంస్కృతాంగ్ల పారశీకముల నుండి కొన్ని యనువాదములు చేసిరి. అందు ముఖ్యమైనవి:

1. సంస్కృతము నుండి తెలుగునకు, ఋకృంగ్రహము, కాళిదాస వాజ్మయము.

2.ప్రాకృతము నుండి తెలుగునకు. కాళిదాస కవిత.

3. ఆంగ్లమునుండి తెలుగునకు- షేక్సిపియరు వాజ్మయము, ఫిట్జ్ గెరాల్డు పద్యాలు, (ఉమరుకైయాము రుబాయతు అనువాదము)

4. ఆంగ్లమునుండి సంస్కృతమునకు-డిటో

5.పారశీకమునుండే తెలుగునకు- ఉమరుకైయాము రుబాయతు.

6. పారశీకమునుండి సంస్కృతమునకు.డిటో

7. సంస్కృతమునుండి ఆంగ్లమునకు- కాళిదాస శ్లోకములు

కొద్దికొన్ని 'మేలుబంతి ' లో ఉదాహృతములు