పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాసుగా రీ సన్నివేశమునకు దగినట్లు లయగ్రాహిని స్వీకరించుటయు ఆ సన్నివేశమున గల లయహోయలును తన పలుకుబడిలో పట్టుకొనుటయు ప్ర్రశంసవహము.

                      ర గ డ

బుడుత నూతను బడిన నుడివిని పొలుపు చెడి పరుగిడు జనకువలె
గడిగి తత్తరపాటుతో గనుకడల వెడవెడపాటుతో ధన
యెడలి చెమటల వీటుతో నెద మబ్బు గబ్బల పోటుతో గడు
నడరు పెదవిని గాటుతో జెరాడు పై వలేవాటుతో మయి
గడను గుంకును తేటుతో వెనుకడను గీల్జడ వేటుతో ముడి
వడెడు బూషణకోటితో గొవనంగు చిటికెన గోటితో మొల
సడలు కనకపు శాటికో వెన్దనెడు చక్కని బోటితో వెలు
వడియె గేలి గృహంబు వెన్నుడు భక్తరక్షణ లోలుడై.

ఇదియు గజేంద్ర మోక్షణము లోనిదే, అసలు ఘట్టము లోనిది. 'సిరికిం జెప్పడు, శంఖ చక్రయుగముం జేదోయి సంధింపడు..." అను పద్యము. ఆ సన్నివేశమునే వెన్నుని వేసమును మరించుక మార్చి అతని గజప్రాణావనోత్సాహ గమన వంరంబమునకు దగిన గతి విశేషము గల రగడను స్వీకరించి, ఏ చందస్సును గ్రహించినను ఛేతగాకున్న నడక చెడగొట్టుటకు కవులకు గల మహావకాశమును జారివిడిచి, ఆ నడక కనురూపములైన వగడైన పలులులతో, బంధుర నిక్షిప్తమైన భావసౌందర్యమును నందుక్షిత మొనర్చు అంత్యాను ప్రాసలతో సహృదయ హృదయావర్జకముగా నడిపించిరి. దాసుగారు. ఆ యీ ఉదాహరణములను గాని అసలు గ్రంధములోని యే పద్యమును గాని యెంత పరికించి చూచినా తిక్కనగారి కవితలో వలె నెక్కడను కనీసము యతి ప్రాసలందును అదుకులు కనిపించవు. అదుకుందకూడ దన్నది దాసుగారి శాసనము. తిక్కనకు వలె నీయనకును పదమధ్యయతి ఆశ్రమ సాధ్యము. సంపన్నులు స్వవ్యమూర్ధము కర్చుసేయనట్లు భావముపై నిఘా వేసి కరబదరము లగు శబ్దముల నిచ్చచొప్పున ఆలవోకగా ప్రయోగించుచు అనాయాసముగా వ్రాసుకొని పొవుటయే వారి వంతు. సందర్బమున కనువైన చందస్సు నెన్నుకొనుటలోని వీరిద్దరు సిద్ధహస్తులు. బీమసేనుని భీషణరోషమును చిత్రించు పట్టున శార్దూలమునో వ్రగ్దరనో యెన్నుకొనును తిక్కన. అట్టిచో సమానమును పరిఢవించుటయు ఆయన తీరు. సత్యవంతుని నీరాలాపమును (36) దాసుగా రొక స్రగ్ధరలో సమాసాట్టహాసము