పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతరంగ సంగీరము నాలాపించు ఉత్తమ పరికరముకూడ కాగలదు. సంగీత సాహిత్యల్ములు రెంటను అచ్చమైన సరస్వతీ స్తనంధయుడైన దాసుగారు చందస్సును వలచుట సహజము. వారి కృతులు ముక్కాలు మున్వీనము చందోఘటితములే. వారికి స్వస్థాన వేషభాషాభిమాన మతివేలముగ నున్నట్లే దేశాద్చ్చందస్సులందే మక్కు వ యెక్కువ. ఈ 'కచ్చపి ' యందుగల 362 పద్యములందును సంస్కృత శ్లోకములు-69, వృత్తములు-58, దండకము-1, లయగ్రాహి-1, మిగిలినవన్నియు దేశత్ఛందస్సులే. సీసములు-91, గీతపద్యములు (తేటగీతులు + ఆటవెలదులు)-73, కందములు-32, ద్విపదలు-8, మజరులు-8, తరువోజలు-2, మధ్యాక్కర-1, రగడ-1.

    పలు విధముల చందస్సులకు లక్ష్యము లుదాహృత పూర్వములు, మిగిలిన వాన కొన్నిటి నుదాహరింతును:-
                       లయగ్రాహి

            చారుగతి నొడ్డునకు జేరుకొని వృక్షముల
                 ఘోరముగ లాగి జలపూరమున గంతున్
           దోరమగు తొండమున నీరమును బీల్చుచు గ
                  భీర వినదంబు పయిమీఱ నెగ జిమ్మున్
           సారవ రజంబున శరీర మొగి బూయబడ
                  బూరి కనకావలము తీరున వెలుంగున్
           బోరున మునింగి పయి మీఱు తనచేత నొక
                  నీరజము బట్టి పోలు పారగ నటించున్.

ఇది గజేంద్ర మోక్షము హరికధలొనిది. మదద్విరధ స్వైరవిహారమును వర్నించు నట్టిది. వీటిని చూచిన యేనునునకు నీలుగెక్కువ. అప్పటి దాని విలాసచేష్టా విశేషములలో అన లది యేపని చేసినను అందొక ద్వని వివిగులభన ముండును. సప్తస్వరములలో విషాదస్వరమునకు నిదానము గజ ఘీంకృతియే కదా. ఆ చేష్టలన్నియు దాని కతి సహజములు. ఏ అబ్జమువంటి అపురూపవు వస్తునో లభించిన అది యటునటు నవిలాసముగా నూగులాడుటయు దాసుగా రెట జూచిరోగాని అదియు అదియు చాల సహజమైన సన్నివేశము అందొక లయబద్దత యుండును. ప్రకృతి ప్రత్యణువున చిటుకు నున్న చీమలో చందోపిల్లశ్వాసలో సంగీతమును దర్శించు లయబ్రహ్మ