పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యొక మార్గమును పట్టించిరిగాని అత:పూర్వము లలితమార్గమే దానికి స్వతస్సిద్ద మైనది. వాల్మీకిలోగాని కాళిదాసులోగాని సుదీర్ఘ సమాసము లెన్ని చూపగలము? శబ్ధాలంకారముల నెన్ని యేరగలము? స్వభావత: దాసుగరి దా మహాకవుల మార్గమే. అయితే దౌర్భాగ్యవశమున గీర్వాణ గిరాంధురంధరులు, శబ్దజాల జాంగలి కులునైన మన ప్రౌఢ ప్రాబంధిక గంధ గజేంధఘటల పాండిత్యవీర విహారముల ఫలితముగా జటిలపద పటాతోపము, సుదీర్గ సమాసముల సాముగరెడీలు గల బంధమున కలవాటు పడిపోయి మన సాహిత్యద్రస్థలు చాలమంది తాదృశబంధము తతంగ మున్నదానినే ప్రౌఢకావ్య మనుకొనుటయు, లేని దానిని కాదనుకొనుటయు జరుగుచున్నది. తస్మై నమ: పాభవరాజ్ముఖాయ.

   పొతన మీది ప్రీతిచే అనుప్రాసములు, సమాసములు మున్నగు వాని విషయమునే ఆ పోకడలు కొన్ని పోకపోలేదు దాసుగారు.

ఉదా॥ కృత్తి యొక్క ఆవిర్భూతి. (2):-
         అభ్రంలిహాదత్ర విబ్రమభ్ర భ్రమ
             కృనీల దీర్ఘశరీర మమర
        ప్రళయ కాలావల ప్రభను జక్రీకృతే
             క్షణముల రౌద్ర మక్షయము గాగ
        త్రైలోక్య కబలనొత్సాహ సూచక ఘన
             వక్త్ర త్రయోగ్రత వాసికెక్క
        బళ్పుబర్భర కేశ సాకారుణ ప్రభా
             కాల సంధ్యారాగ కాంతి దనర

ఇందు ప్రధమ పాదము యధాతధముగ పోతనగారిది. మిగిలినవి దాసుగారివి. పోతన గారి పోలిక కొంత వచ్చినద్.

2.నరసింహావతారము (15):-
      గంభీర భీకర గర్జారవంబున
          బ్రహ్మాడఖాండ కర్పరము నగుట
      చటుల పటాచ్చటా చలన సంజాత ప్ర
          చండ వారాహతిన్ గొండ లెగయ