పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోరిక తీరదాయె, నిను గొల్సున జూడగ దూరమాయె, నీ
వారికి భారమాయె, సుమబాణుని వైరము ఘోరమాయె, నీ
నేరువు నేరమాయె, మఱి నిందలు నాఱులు మాఱులాయె, నా
పేరున లోపమాయెగద భీత మృగాక్షి : యికేమి వ్రాయుదున్.

ఇందు తిరుపతి వేంకటకవుల బాణీ స్పురించినది.* స్తుత్యమృత్యుంజయము"ఖండికలో (21-23) ఎనిమిది పద్యము లందును అంత్యానుప్రాసస్ పకడ్భందుగా పడి వాని స్తోత్రధర్మమున కుత్కర్ష కల్గించినది.

 శై లీలాలిత్యము
   శైలి యనగా శాబ్ఢిక చంద తాండవము కాదు, సమాన వ్యాయామ వైయూత్యముకాదు. రసభావసందర్భములకు తగిన్ రచనా విన్యాసము. అటుగానిచో అది శైలికాదు. ధోరణి, సహృదయ పాఠకులకు చవిగొల్పి వానిని సద్య: స్వాద్యము చేయుట శైలియొక్క పరమ ప్రయోజనము. కావ్యజగత్తున నైకవిధ శైలీ మార్గమనుకౌనుట పొరపాటు. వారివారి వ్యక్తిత్వము లందులకు ప్రధాన నిమిత్తములు, ఒకని శైలియందలి జీవలక్షణము జటిలత యగును. ఒకనియందు ప్రౌఢి యగును. వేరొకనిది లాలిత్యము, ఇంకొకనిది పేలవత, దాసుగారి శైలియొక్క స్వభావజేఎవముగల వారి కది తగియున్నది. లాలిత్య మనగా సర్వత; ప్రసన్నత. ప్రసాదగుణము మహాకవిత్వ లక్షణములలో నొకటి. అదికావ్యమైన రామాయణము రచనా రామణీ;యములోని రహస్వమదే. కాళిదాసాదుల  కవితాకళాకీలక మదే. మురారిభట్ట ప్రభృతులు వచ్చి స్వకీయ గీర్వాణముతో సార్వజనీన గీర్వాణ కావ్యశైలిని మరి
  • "ధనమా పోవును, మానమా చెడును...." (శ్రచ్వణానందము) రచన 1837.

"వేసవి డగ్గరాయె, మిమువీడుతకున్ మన సొగ్గదాయె...." (ఆత్మకూరు సంస్థానమునకు మొదటిసారి ఆ 1897 లోనే వెళ్లినప్పుడు చెప్పినది.) చూ. జాతకచర్య - పుటలు 100-101. దాసుగారి పద్యములు రెండును ఆయన ఏలూరు వెళ్లి నప్పుడు సోమంచి భీమశంకరం గారి వేశ్య నుద్దేశించి చెప్పినవి. దాసుగారిది తన 24 వ వంశమని స్వీయ చరిత్రలో స్పష్టముగ చెప్పిరి. వారి జననము 1884. అందుచే ఆ సన్నివేశకాలము 1888.