పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

     2.దేశభక్తి ప్రబోధము(52):-
        మనడూ శక్తియైకమత్యము బొందక
        యలతి సగతునైన నడచు టేట్లు?
        లెన్పునందు బడక రెండు జాముల యెండ
        కడగి దూదినైన గాల్చ గలదె !

అది యొక విధముగా ప్రతి వస్తూవను ప్రతిన త్తివిగూడ గల్గియున్నది. 51 వ పుట యందలి..."అమిత విజృంభణంబు లలరా తగునా సుజనాళి కెప్పుడున్" అను పద్యమున అర్ధాంతర న్యాసము హేతూత్ప్రేక్షతో చెలిమి చేసినది. హేతూత్ప్రేక్ష కింకొక చక్కని లక్ష్యము;

      విశ్వేశ్వాభిషేకాయ । సతి బాగీరధీ ఇలే
      కాశ్యాం కో మాం వాంచతీతి । నారికేలో నజాయతే (77)

సాగర తీరమున కైదామడలు పైబడిన ప్రదేశములందు కొబ్బరి మొలకెత్తదు. దక్షిణ దేశమునందేగాని యుత్తరేదేశమున అది యుండదు. అందుకే దానికి 'తెంగాయ ' అనిపేరు. కాశీనగరమున కొబ్బరికాయ లేక పొవుటకు కారణ మట విశ్వేశ్వరాభిషేకర్ధము గంగాజల ముండుట చేతనే నట!

    ఉల్లేఖము గూడ దాసుగారి వాక్కున సంకుత్పుల్ల మైనది:
    ఉదా॥ 1. మహీజాదరొష్ఠ ప్రవాల్/ఎzగ్ని చ్చటాభా
                పురద్విడ్డను: కాననేzగ్నిచ్చటాభా
                సకృత్కొళికాంఘ్రి స్ధితాzంబోజ తుల్యా
                చకాస్తే న్మ తే దృక్ ప్రభో రామచంద్ర: (74)
ఇట నుల్లేఖము ఆర్ధికోసమా బీజభూతమైనది.
        2.సౌర స్యాగ్రేzరుంధతీన: మధ్యే సౌదామనీ యధా
           ఆధస్తాతి పాంచాలికేవ । కాశ్యాం బాతి కులాంగనా॥(77)

కాశిలో కులాంగన మేడచివర నున్నప్పుడు కనీ కనిపించనట్లుండును, నడుమ మెరునట్లు తోచును, దిగువ నున్నప్పు డొక బొమ్మవలె నుండునట. ఆ సామ్యములు దామె పాతివ్రత్యమహిమ, నపుర్ఫర్చస్విత, సాలంకార వివిభాంగ సౌష్టవము ధ్వనితములు. ఆ కులాంగనా తేజ॥ స్ఫూర్తికి భిన్నస్థల కాలావస్థ అభ్యంతరములు కా