పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లక్ష్మి వివాహము (36) వారి రూపక వైఖరులకు తగిన తార్కణలు. ఉపమ వేసిన వేరొక వాలకమే గదా రూపకము. ఉపమా నిరూపణమున నిపుణుడైన కవి రూపక విపుణు డగుటలో నాశ్వర్య మేముండును? ఉపమెయమునకు తగిన తూకములో నుండవలె నుపమ. ప్రబంధకవుల నరు కెక్కువగా ప్రాచీన కవి సమయముల పాతరనుంది తీసినది. దాసుగారి మన మనుగడ పరిధిలోనిది. మన కనునిత్య పరిమిత మైనది.

   కడమ యలంకారములకు దాన వాజ్మయమున విరశ ప్రచారము, హరికధలలో వచనములందు కాదంబరీ గద్యలోవలె శ్లేష,  విరోధాభావము మున్నగు వాని కెక్కువ వినియోగము గలదు. ప్రకృతము 'కచ్చపి ' నింది మరి కొన్నిటి నుదాహరింతును:-

     సీ॥ కందున్న పున్నమ చందురు గాదంటే
                మో వీని మోమున కుపమ యేది?
          అబ్జము ల్వాడు నటన్న నిక్కంబోయి
                కగు నెచ్చట విదర్శనాతిశయము?
         ఏన్గు తొండమ్ము లిస్సీవంక ల్న వీని
                హస్తమ్ములకును దృష్టాంత మున్నె?
        మరి యనంగుల డగు మరుని కితని తోడ
               సకియతో నుంతైన సమ మదెట్లు?

ఇందు ప్రతి పాదాంతకమునను సందర్భ సహజముగా పేర్కొనబడ్డ యవమరు లలంకారవాచకములు. తత్తదలంకారములకు వర్ణ్యముపట్ల నిరవకాశ మనుచున్నాడు కవి. అందుచే అనవ్య స్ఫూర్తి గలదు కాని యది వాచ్యముగా లేదు. ధ్వనికమైనది. ఇదో సొగసు. ఇంచుమించిట్టివే జగన్మోహినీ మూర్తి చిత్రణ్ పద్యము (19). అర్ధాంతర వ్యాస విన్యాసము తత్ర సందర్భోచితముగా నున్నది.

ఉదా॥ 1. విఘ్నేశ్వర ప్రార్ధన (2):-
            కోరికల కడ్దు దగిలెను వారిలోన
            గొప్పవాడవు గాన నిన్ గొల్వవలనె
            అడ్డు దగిలెదువా డెక్కువైన యప్డు
            వేడుకొన కేమి చేయుదు విఘ్ననాధ!

ఇందలి హృదయంగము చమత్కారము గమనార్హము.