పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7.శ్రీహరి కధామృతములో నొకవో మాయావృతుడైన మూఢ మానవుని అద్దములోని తన నీడతో తాను పోరు నిచ్చుకతో మనమించుక చతురముగా నున్నది.(కచ్చపి. పుట 77)"-

   స్వచ్చాయాం దర్పణే పశ్యన్: యుద్యతే చటకో యధా
   మాయాయాం స్వం వీక్షమాణ: । తధా మూఢో విముహ్యతి॥

చత్రభరపోని మరపించుచున్న దీ పోలిక దాసుగారి యవనులు కొన్ని ఉపరి వర్ణనా వైదగ్ద్య ప్రకరణ్ంఅమునను ప్రసక్తములైనవి. ఎప్పట్టున జూచినను వారి యనమ లెక్కడనుండియో తెచ్చిపెట్టుకొన్న ఎరవుసొమ్ములవలెగాగ స్వీయస్థిరాస్తి యైన లోకజ్ఞత నుండి తీసి వాడుకొనుచున్నట్లుండును.

  ఉపమ దాసుగారి కుంపుడుఇఅత్తెయైతే స్వభావోక్తి సహధర్మచారిణి . ఉన్నట్లు చెప్పిన స్వభావోక్తి యగునేమోకాని అది అలంకారముగాదు. అందులకే "స్వభావోక్తి రసౌచార్రు యధాపర్వస్త వర్ణనమ్" అన్నారు విద్యానధులైన పెద్దలు. స్వభావోక్తిని విన్యసించుటకు మిక్కిలి లోకాలోచన జ్ఞానము, అందు చారుత్వము నిక్షేపించుటకు సౌందర్యతృష్ణ కావలె. ఇందులకు లక్ష్ల్యములుగ దాసుగారి యీ పద్యములను గమనింపదగును:

    "ఆకైన నల్లాడనీక దిగ్భంధన
        ముగ గాలి చెమ్మటం బొదవె నుక్క....
    "ఉడుకెత్తి పాదులన్ మడిగిన నీడలు
         చల్లగ దూర్చున సగుచుండే...(పుట. 11)

ఇంకను నవవధూవరచేష్టలు (పుటలు 25-26), అమని (34), శ్మశానము (36), శివుని ముసలి వాలకము (పరిశిష్టము-3), తాటకాగమనము (23) మున్నగు సందర్భములు చూడనగును.

    మూర్తపదార్ధమునేగాక అమూర్తమైన వట్టి భావమునుగూడ గ్రహించు శక్తి ఛాయాగ్రహక యంత్రమున కున్నచో దాసుగారి కృతుల వనేక చాయాచిత్రములతో అచ్చువేయవచ్చును. చిత్రకారుడైతే మాత్రము దాసుగారి భావముల నాశ్రయించి కృతకృత్యుడు కాగలదు.
    దాస కవితాలంకారములలో తృతీయ స్థానము రూపకముది. వైదేహి దాశరధుల వనవాస రాజభోగము (26), సువర్ణ విశ్వరూపము (32), విజయ