పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంచుమించుగ దాసుగారి ప్రతిపద్యము చదువరి పెండ్లికొడునకు సాలంకార కన్యాదానమే. ఆం దలంకరముల పై పద్యము గలదుగాని దాసుగా రుపమకు తాళిగట్టిరి. అది యొక శైలూషి యని ఆప్పయదీక్షుతులవారు సెలవిచ్చిరి. దాసుగరు దానిచేత గీయించిన వాలకమ్లు ఆడించిన ఆటలు చూచినచో చట్టున కాళిదాసు జ్ఞప్తికి తగిలి తను అతడు తెలుగువాడు కాడులే అని యటుంచి- "ఉపమా ఆదిల్భట్టవ్య" అన్నదే మాట యనుకోందుము. ప్రతి యూరకవియు మనములు వాడు వాడేకదా మరి మాతనిదేమి ప్రత్య్హేక్త ! అనిపించును. పదిమందిదిష్టి తగిలిన పడుచుపిల్ల యొక్క నితో కన్ను గిలిపిన దన్నచో అది వాని యక్కటి యోగ్యతకాదా మరి. అన లీయువను అలంకార ప్రపంచమున పరమ ప్రాచీనమైంది. ఋగ్వేదమునందును దానికిరూడమూలమైన స్థితియున్నది. ఆదికవి కడ షాష్టాంగపడిన దామె.భరతాచార్యుని పరిగణనమునందునుజ్ దానిదే అగ్రతాంబూలము. అంతేగాక అప్పయదీక్షితుల వారి వక్కణ ప్రకార మది సర్వాలంకార బీజభూతమైనది. అందుచేతనే అలంకారములలోదానికంత ప్రాముఖ్యము తద్విన్యాసమున నిరుపమానమైన విపులత ప్రదర్శించు శక్తి సిద్దించుటకు కాళీదాసత్వమే నిమిత్త్ము కానక్కరలేదు నారాయణదాసత్వము వలనను అది సిద్దింపగలదు. నిపుణతతో బాటు దాసవజ్మయమున ఉపమకధిక ప్రాచుర్యమును గలదు.

ఉదా॥ 1. భగవంతుని కొలత్(పుట 27):
          సి.వలయరేఖకు బోలె నశమె తెల్పగ నీ
                  కాది మద్యాంతము లప్రమేయ:
            ఎల్ల జగంబుల కీవె యాధారము
                  లెక్కలు కన్నింటి కొక్కటి వలె
            పెరుగవు తరుగవు విభజింపబడవు శూ
                 న్యాంకము వలె సకలంకచరిత ।

ఏవంవిధ గణితోపమాన మపూర్వము. ఆయువములకు దగినట్లా సంబుద్ధులు సాభిప్రాయములు.

      2. కుంభకర్ణుడు (పుట. 28)
           సి. నంజకెంజాయచే నంజనాచల మటు
                   కాని దుస్తుల నీలకాయ మమర